Tuesday, April 30, 2024
- Advertisement -

‘ఎఫ్‌ 2’ రివ్యూ

- Advertisement -

గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్నాడు సీనియ‌ర్ యాక్ట‌ర్ వెంకీ. త‌న తోటి హీరోలు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తోన్న వెంకీ మాత్రం అచితుచి సినిమాల‌ను ఎంచుకుంటున్నాడు. వెంకీ తాజాగా న‌టించిన చిత్రం ఎఫ్2. ఈ సినిమాలో కూడా మ‌రో హీరోగా న‌టించాడు. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లు నటించిన ఈ చిత్ర‌నికి అనిల్ ర‌విపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

క‌థ‌
త‌మ‌న్నా, మెహ‌రీన్‌ అక్కా చెల్లెళ్లు. వెంక‌టేష్ ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు య‌త్నిస్తుంటారు.ఇదే స‌మయంలో వ‌రుణ్ మెహ‌రీన్‌ను ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ ,మెహ‌రీన్‌ని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌ను హెచ్చ‌రిస్తాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు మెహ‌రీన్‌ని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి తోడ‌ళ్లులు న‌లిగిపోతుంటారు. మీరిద్ద‌రూ ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వ‌స్తుంద‌ని, ప‌క్కింటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఈ తోడ‌ల్లుళ్లకు స‌ల‌హా ఇస్తాడు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ ఎందుకు వెళ్తారు? ప‌్ర‌కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగార‌న్న‌ది అస‌లు క‌థ‌.

విశ్లేష‌ణ‌:
ఇది భార్య బాధితుల సినిమా అని చెబుతూనే ఉన్నాడు ద‌ర్శ‌కుడు. ఇద్ద‌రు భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయి? ఆ ఇంట్లో ఎలాంటి వినోదం పుడుతుంది? అన్న‌దాని నుంచే పుట్టింది ఈ సినిమా. ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీ’లాంటి చిత్రాల్లో వెంక‌టేష్ చేసిన పాత్ర‌లు మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలో చేయ‌లేదు. చాలా రోజుల త‌ర్వాత ఆ స్థాయి పాత్ర‌లో వెంక‌టేష్‌ను చూస్తాం. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు.అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా. క‌థగా చెప్పాల్సి వ‌స్తే, ఇదేమీ గొప్ప క‌థ కాదు. గ‌తంలో ‘సంద‌డే సంద‌డి’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి. ఫ‌స్టాఫ్‌లో ఉన్న బిగి ద్వితీయార్ధంలో రాదు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:
‘పటాస్‌’, సుప్రీమ్‌, ‘రాజా ది గ్రేట్‌’ ఇలా వ‌రుస హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా కావ‌డంతో ఎఫ్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ర‌చ‌యిత‌గా అనిల్‌రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితే, పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -