ఆర్​ఆర్​ఆర్​ నుంచి ఫస్ట్​సాంగ్​ వచ్చేది ఎప్పుడంటే ..!

ఆర్​ఆర్​ఆర్​కు సంబంధించిన ఏ చిన్న అప్​డేట్​ వచ్చినా సంచలనంగా మారుతూ ఉంటుంది. ఇటీవల విడుదలైన మేకింగ్​ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా నిలిచింది. చారిత్రక వీరులు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం జీవిత చరిత్రల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నది. ఇక విజయేంద్రప్రసాద్​ కథను అందిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​.. కుమ్రంభీంగా జూనియర్​ ఎన్టీఆర్​ నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్​ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్​ విడుదల కాబోతున్నది. ఈ మేరకు చిత్ర యూనిట్​ ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. టీ-సిరీస్, లహరి మ్యూజిక్ భారీ మొత్తం వెచ్చించి ఆడియో రైట్స్​ను దక్కించుకున్నాయి. ఇక శాటిలైట్​, డిజిటల్​ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్నది.ఆగస్టు 1వ తేదీ ఉదయం 11 గంటలకు ‘దోస్తీ’ పేరుతో ఆర్​ఆర్​ఆర్​ నుంచి ఫస్ట్​ సాంగ్​ విడుదల కాబోతున్నది.

ఐదుగురు సింగర్లు ఈ పాటను విడుదల చేయబోతున్నారు. తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. కీరవాణీ మ్యూజిక్ అందించారు. హేమచంద్ర పాడారు. ఈ పాట కోసం ఫ్యాన్స్​ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలైతే.. తారక్​, రామ్​చరణ్​ పాన్ ఇండియా స్టార్లుగా మారబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాలు వచ్చి మూడేళ్లు కావడంతో ఆయా హీరోల అభిమానులు ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Related Articles

Most Populer

Recent Posts