మద్యం మానేశానంటున్న హీరో శింబు.. కారణం?

- Advertisement -

సాధారణంగా మనం ఎన్నో సందర్భాలలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని వినే ఉంటాం. మద్య తాగటం వల్ల కేవలం అనారోగ్యం పాలవ్వడమే కాకుండా దీనికి బానిసగా మారి ఎంతోమంది వారి జీవితాలను నాశనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి కోవలో సినీ తారలు కూడా ఉన్నారు.మద్యానికి బానిసై సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు కొందరైతే,ఆ వ్యసనం నుంచి బయటపడి తమ జీవితంలో నిలదొక్కుకున్న వారు మరి కొందరు ఉన్నారు. రెండో కోవకు చెందిన వారిలో నటుడు శింబు కూడా ఉన్నారు.

కోలివుడ్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న శింబు తాజాగా “మానాడు” అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కరోనా కారణం వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక పాటను ట్విట్టర్ వేదికగా చిత్రబృందం విడుదల చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శి నటిస్తున్నారు.

Also read:యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

తాజాగా వీరందరూ కలిసి లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే నటుడు ఎస్‌జే సూర్య హీరో శింబుని ఉద్దేశించి పలు ప్రశ్నలు అడగగా.. ఓ ప్రశ్నకు సమాధానంగా తను మద్యం మానేసాను అని తెలిపారు. మద్యం మానేసి సుమారు ఏడాది కాలం కాబోతోందని, మద్యం మానేయడం వల్ల తను ఎంతో చురుకుగా ఉన్నానని ఈ సందర్భంగా శింబు తెలియజేశారు.

Also read:రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని… తర్వాత ఏమైందంటే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -