Monday, April 29, 2024
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్ చూపు ఎటువైపు?

- Advertisement -

టీడీపీ రాజ‌కీయాలు, వార‌స‌త్వం గురించి మాట్లాడిన ప్ర‌తిసారి ఎన్‌టీఆర్ పేరు వినిపించ‌కుండా ఉండ‌దు. తెలుగుతెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకోవ‌డ‌మే గాక తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్ర‌జ‌ల‌ను పాలించిన‌టువంటి నంద‌మూరి తార‌క‌రామారావు పేరునే కాదు.. న‌ట‌న‌కు కూడా పునికి పుచ్చుకున్నాడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌. ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. జూనియర్ అక్క సుహాసిని కోసం కూకట్ పల్లిలో ప్రచారం చేస్తాడని కొందరు.. మరోచోట పోటీచేస్తాడని మరికొందరు భావించారు. కానీ ఎన్టీఆర్ ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు.. ప్రచారమూ చేయలేదు.. అయినా ఆయన గురించి రకరకాలుగా రాజకీయంగా చర్చ జోరుగా సాగింది.

ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో మళ్లీ జూనియర్ పేరు మారుమోగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఈయన పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. . ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే వైఎస్ాఆర్‌సీపీ ఆ సామాజిక వర్గం నేతను బరిలోకి దించే ప్రయత్నం చేస్తోందట. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావును పోటీకి దించాలని జగన్ ఆలోచిస్తున్నాడని స‌మాచారం. అయితే నార్నె శ్రీనివాసరావు త‌ర‌పున‌ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అనేది ప్ఇప్ప‌డు ఇప్పుడు హాట్ టాపిక్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం కొత్తేమీ కాదు..

తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఇమేజ్ ఉన్న సినీ హీరోల్లో జూనియర్ ఒకరు. ఎన్నికల ప్రచారం ఎన్టీఆర్ కు కొత్తేమీ కాదు. 2009లో టీడీపీ కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ తరువాత చంద్రబాబుకు – హరికృష్ణకు మధ్య ఏర్పడిన గ్యాప్ కారణంగా జూనియర్ కూడా టీడీపీకి దూరంగానే ఉంటూ వచ్చారు. దీంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో సుహాసిని కోసం నందమూరి ఫ్యామిలీ అంతా ముందుకు వచ్చింది గానీ.. జూనియర్ మాత్రం ప్రచారానికి రాలేదు. ఇప్పుడు మామ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తారా..? లేదా అన్నది ఆసక్తిగా మారింది. కూకట్ పల్లి విషయంలో సుహాసిని విజయాన్నికాంక్షిస్తూ ఓ ట్వీట్ చేశారు నంద‌మూరి సోద‌రులు. ఈ సారి మామ కోసం అదే ప‌ద్ద‌తి ఫాలో అయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

కానీ ఇక్క‌డే ఓ లొసుగు ఉంది. చంద్ర‌బాబు వాడుకొని వ‌దిలేసే నైజం ఎన్టీఆర్‌కు 2009 ఎన్నిక‌ల్లో తెలిసింది. మ‌రి అది మ‌న‌సులో ఉంచుకొని మామ‌ను గెలిపించాల‌ని ఎన్‌టీఆర్ కోరుతారా? లేక‌ తాత స్థాపించిన పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌కుండా మౌనంగా ఉంటారా? వేచి చూడాలి మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -