Wednesday, May 8, 2024
- Advertisement -

‘ఎమ్మెల్యే’ రివ్యూ

- Advertisement -

సినిమా ప‌రిశ్ర‌మ‌కు నంద‌మూరి వంశం వ‌చ్చిన న‌టుడు క‌ల్యాణ్‌రామ్‌. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఏళ్లు గ‌డిచాయి.. కానీ కొన్ని హిట్లు మాత్ర‌మే కొట్టాడు. రెండేళ్ల కింద‌ట ప‌టాస్ సినిమాతో హిట్ కొట్టిన క‌ల్యాణ్‌రామ్ మ‌ళ్లీ ఆ త‌ర్వాత అంత హిట్ కొట్ట‌లేదు. ఇప్పుడు మ‌రో కొత్త సినిమాతో కొత్త ద‌ర్శ‌కుడితో ‘ఎమ్మెల్యే (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి)’గా క‌ల్యాణ్‌రామ్ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌కు వ‌చ్చాడు. మ‌రీ ఆ సినిమా ఎలా ఉందో చ‌ద‌వండి..!

క‌థ‌: కల్యాణ్ (కల్యాణ్‌రామ్‌) ఇందు (కాజల్‌)ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించాల‌ని కోరుతూ వెంటప‌డుతుంటాడు. ఆమె ప్రేమ ద‌క్కించుకోవ‌డానికి ప్లాన్‌లు త‌దిత‌ర వేస్తాడు. అయినా ఇందు ప్రేమించ‌కుండా కల్యాణ్‌ను తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. ఈ స‌మ‌యంలో ఇందు ఓ సమస్యకు వ‌చ్చి ప‌డుతుంది. ఆ సమస్య నుంచి క‌ల్యాణ్ తన తెలివితేటలతో బయటపడేస్తాడు. దీంతో ఇందుకి కల్యాణ్‌పై ప్రేమ పుట్టి ఇద్ద‌రు ప్రేమించుకుంటారు. అయితే ఈ స‌మ‌యంలో ఇందు తండ్రి జయప్రకాశ్‌రెడ్డి త‌న కూతురుని ఎమ్మెల్యేకు ఇచ్చి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. వారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప (రవి కిషన్‌) ఉంటాడు. అత‌డికి ఇచ్చి ఇందును పెళ్లి చేయాలని నిర్ణ‌యిస్తాడు. ఈ స‌మ‌యంలో త‌న ప్రేమ విష‌యం ఇందు తండ్రికి చెప్ప‌గా ‘నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు’, అప్పుడైతేనే త‌న కూతురును ఇస్తాన‌ని చెబుతాడు. త‌న ల‌వ‌ర్ కోసం క‌ల్యాణ్‌ ఎమ్మెల్యే అయ్యాడా? ఇందుని పెళ్లి చేసుకున్నాడా? అనే విషయాలు సినిమా చూడాలి..!

క‌థ‌నం : రొటీన్ స్టోరీనే కానీ భిన్నంగా రాసుకుని కమర్షియల్‌గా తీశారు. ఫ‌స్టాఫ్‌లో ఇందును ప్రేమించ‌డానికి క‌ల్యాణ్ చేసే ప్ర‌య‌త్నాలుగా సాగుతుంది. కల్యాణ్‌ను మంచి లక్షణాలు ఉన్న‌ అబ్బాయిగా చూపించారు. కబ్జాకు గుర‌యిన ఇందు ఆస్తిని తిరిగి ద‌క్కేలా కల్యాణ్ చేసిన ప్ర‌య‌త్నాలు కామెడీగా ఉన్నాయి. వినోదాత్మ‌కంగా తొలి భాగంగా తీశారు. సెకండాఫ్ హీరోయిన్‌తో త‌న పెళ్లి కోసం క‌ల్యాణ్ ఎమ్మెల్యే కావడానికి చేసిన ప్ర‌య‌త్నాలు సినిమాగా చూపించారు. కమర్షియల్‌ విలువలతో పాటు చిన్నసందేశం సినిమా ద్వారా ఇచ్చారు. పెద్ద స‌స్పెన్స్‌కు అవ‌కాశం లేదు. లాజిక్ లేకుండా సినిమా తీయ‌డంతో వాటి గురించి ఆలోచించొద్దు. పాటలు, ఫైట్‌లు పంచ్‌‌ డైలాగ్‌లు ప‌ర‌వాలేదు. పాత కథనే కమర్షియల్‌గా తీసి కొంచెం కామెడితో తీశాడు.

న‌ట‌న‌: కల్యాణ్‌రామ్ స్టైలిష్‌గా క‌నిపించాడు. కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. కాజల్‌ అందంగా కనిపించినా సెకండాఫ్ మాత్రం పాటలకే పరిమితమైంది. ‘రేసుగుర్రం’ తర్వాత రవికిషన్‌కి విల‌న్‌గా మంచి పాత్ర‌లో క‌నిపించాడు. ఫ‌స్టాఫ్‌లో వెన్నెల కిశోర్‌, సెకండాఫ్‌లో పృధ్వీ, పోసాని కృష్ణమురళీ కామెడీ చేసి న‌వ్వించారు. మణిశర్మ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడికి తొలి సినిమా కావ‌డంతో అంత‌గా ఆశించ‌వ‌ద్దు.

నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవికిషన్‌, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణ మురళీ, వెన్నెల కిశోర్‌, పృధ్వీ తదితరులు
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌
సంగీతం : మ‌ణిశ‌ర్మ‌
నిర్మాతలు: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వప్రసాద్ (బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌)

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -