రాఖీ ఫ్యాన్స్ మరో గుడ్‌న్యూస్

- Advertisement -

కేజీఎఫ్-2 .. బాక్సాఫీసు దగ్గర రికార్డుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుని దూసుకుపోతోంది. బాలీవుడ్‌లోనైతే రాఖీభాయ్‌ మానియా ఇప్పటికీ కొనసాగుతోంది. కేజీఎఫ్-2 దూకుడు ఒకపక్క కొనసాగుతుండగానే.. ఆ సినిమా మేకర్స్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

మార్వెల్‌ యూనివర్స్ తరహాలో కేజీఎఫ్‌ 3ని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రకటించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేజీఎఫ్-2 దర్శకుడు ప్రశాంత్ నీల్ .. సలార్‌ ప్రాజెక్టుతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో కేజీఎఫ్‌ను అక్టోబర్ నుంచి మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024లో కేజీఎఫ్-3 విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేజీఎఫ్ 2 అన్ని భాషల్లో కలిపి మొత్తం 1180 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్న చిట్టి

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

పృథ్వీరాజ్‌గా వస్తున్న అక్షయ్ కుమార్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -