ఇది బాహుబలి గొప్పదనమా.. జనాల పిచ్చిదనమా..!

- Advertisement -

బాహుబలి పిచ్చి పీక్స్ కు చేరినట్టుగా ఉంది. ఈ సినిమా టికెట్ల గురించి ముష్టి యుద్ధాలు మొదలయ్యాయి. థియేటర్లపై దాడులు కూడా జరిగిపోతున్నాయి. ఇక క్యూ లైన్లలో తోపులాటలు.. అత్యంత సహజం అయిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాహుబలి సినిమా టికెట్ల అమ్మకం గురించి ముందుగానే కౌంటర్లు ఓపెన్ అయ్యాయి.

సినిమాపై ఉన్నక్రేజ్ తో యువతీయువకులు టికెట్ల కోసం  గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడ్డారు. సినిమా ఉన్న అభిమానం వారికి ఎనలేని ఓపికను తెచ్చినట్టుగా ఉంది. మొహమాటాలు అన్నీ పక్కన పెట్టి సినిమా టికెట్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. క్లాస్ పీపుల్ ఉంటారను కొనే మల్టీ ప్లెక్స్ ల వద్ద కూడా క్యూ లైన్లలో తోపులాట తప్పడం లేదు.

- Advertisement -

ఇక ఇదే దుర్మార్గం అనుకొంటే.. కొన్ని చోట్ల థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. టికోట్లు దొరకడం లేదనో.. అవి దక్కించుకొనే అవకాశం లేదనో .. థియేటర్లపై అల్లరి మూకలు రాళ్ల దాడులు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. వందల, వేల థియేటర్లలో విడుదల అవుతున్నా.. బాహుబలి టికెట్లకు ఇంత క్రేజ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జనాలకు ఇంత వెర్రేమిటో అర్థం కానిదే అవుతోంది. మొత్తానికి ఇంత వరకూ ఏ తెలుగు సినిమా కూ కానరానటువంటి క్రేజ్ బాహుబలికి కనిపిస్తోంది. ఇదైతే వాస్తవం. ఇంత వరకూ తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకూ ఇంత క్రేజీ నెస్ కనపడలేదు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -