Wednesday, May 8, 2024
- Advertisement -

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కెప్టెన్ రాజు క‌న్న మూత శోక‌సంద్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌…..

- Advertisement -

ఈ మద్య చిత్ర పరిశ్రలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల నుంచి తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో పలువురు నటీ,నటుల మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచివేస్తుంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ అలియాస్‌ ‘కెప్టెన్‌ రాజు’(68) కన్నుమూశారు. దీంతో శోక‌సంద్రంలో ద‌క్షిణ సినీ ప‌రిశ్ర‌మ మునిగిపోయింది.

తాజాగా శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. కెప్టెన్ రాజు(68) గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు.

ఇంగ్లీష్‌ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్‌ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు.

1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచమ‌య్యారు. రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -