Wednesday, May 8, 2024
- Advertisement -

బాబోయ్ మణిశర్మ సంగీతమా!

- Advertisement -

మణిశర్మ అంటే ఇండస్ట్రీ లో అందరికీ గౌరవం. మెలోడీ లని స్వరపర్చడం లో మణిశర్మ ని కొట్టే వాడు ఎవడూ లేరు అంటారు. అలాగే బాక్గ్రౌండ్ స్కోర్ అందించడం లో మణిశర్మ తర్వాతే ఎవరైనా. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది నేడు సంగీత దర్శకులు గా పరిశ్రమ లో రాణిస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎప్పుడో విజయానికి దూరంగా ఆగిపోయారు. కారణం ఏదైనా కానీ మణిశర్మ కి ఒకప్పుడు ఉన్న వైభవం ఇప్పుడు లేదు. అప్పుడెప్పుడో ఆ మధ్య నాని నటించిన జెంటిల్మన్ అనే సినిమా తో మళ్ళీ మణిశర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు అని ఆరాటపడ్డారు కానీ ఆయన మాత్రం రెండు మూడు సినిమాలకే తిరిగి పరాజయ పథాన్ని వెతుక్కున్నారు.

ఇప్పుడు తాజా గా ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఆయన స్వరపరిచిన పాటలని వింటే ఆయన ఇలాంటి పాటలు చేయడమేంటి అనిపిస్తుంది. మణిశర్మ కూడా ఒకప్పుడు ఊర మాస్ సినిమాలకి సంగీతం అందించారు కానీ అవన్నీ వినసొంపైన గేయాలు గా మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఆయన సంగీతం అందిస్తున్న పాటలు వింటుంటే లౌడ్ డప్పులు, అర్ధం లేని సాహిత్యం తప్ప పెద్దగా ఆస్వాదించి లూప్ లో వినేంత ఆనందం అయితే రావడం లేదు.

నిర్మాతలు ఇచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ అని ఫీల్ అవుతున్నారో లేదా ఆయన తో పని చేసే దర్శకులు ఇటువంటి నాసిరకం బాణీలు కోరుకుంటున్నారో అంతు చిక్కడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -