Tuesday, April 30, 2024
- Advertisement -

నా పేరు సూర్య సైనికా సాంగ్…… ఎమోషనల్ మ్యూజిక్ అదిరింది…… కానీ……?

- Advertisement -

తెలుగు సినిమా టాప్ రేంజ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్‌ది కాస్త కష్టపడే తత్వం. మరీ నిర్లక్ష్యంగా పాటల్లో అటూ ఇటూ నడుస్తూ డ్యాన్స్ అనుకోమనడం, తానేం చేస్తే అదే గొప్ప యాక్టింగ్ అనే అథమస్థాయిలో ఆలోచనలతో అయితే అల్లు అర్జున్ ఉండడు. కష్టపడడానికి రెడీగా ఉంటాడు. అందుకే సూపర్ క్రేజ్ ఉన్న హీరోలతో సమానంగా కలెక్షన్స్ కొల్లగొడుతూ ఉంటాడు బన్నీ. ఇప్పుడు నా పేరు సూర్య……. నా ఇల్లు ఇండియా లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. యాంగర్ మేేనేజ్‌మెంట్‌లో ఫెయిల్ అవుతూ ఉండే ఒక ఎమోషనల్ సైనికుడిగా అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ఇంపాక్ట్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుంది. కానీ ఎక్కడో చిన్న డ్రమెటిక్ ఆర్ ఫీల్ మిస్సయిన ఫీలింగ్ మాత్రం ఉనింది. ఇప్పుడు సైనికా సాంగ్‌ విషయంలో కూడా అదే జరిగింది. మ్యూజిక్ కంపొజిషన్ మొత్తం కూడా అదిరిపోయింది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. కాకపోతే లిరిక్స్‌ని మాత్రం మ్యూజిక్ పూర్తిగా డామినేట్ చేసేసింది. అంతేకాకుండా తమిళ్ డబ్బింగ్ సాంగ్‌కి తెలుగు లిరిక్స్ సింక్ చేసినట్టుగా ఉంది వ్యవహారం. సింగర్ కూడా ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయాడు. విశాల్ శేఖర్ అందించిన సూపర్ మ్యూజిక్‌కి అదే స్థాయి లిరిక్స్ పడి ఉంటే మాత్రం…… ఆ లిరిక్స్ కూడా బాగా వినిపించేలా చేసి ఉంటే మాత్రం ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరేంజ్ చేసిన అన్ని స్పీకర్స్‌లోనూ ఈ సాంగ్ మోత మోగిపోయేది. కానీ సూపర్ ఎమోషనల్ మ్యూజిక్ ఉన్నప్పటికీ లిరిక్స్ అర్థం కాకపోవడం…….సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేయడంతో ఇంపాక్ట్ తగ్గిపోయింది. కష్టపడి తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య…….. నా ఇళ్ళు ఇండియా సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -