Wednesday, May 1, 2024
- Advertisement -

‘నక్షత్రం’ మూవీ రివ్యూ

- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ మంచి పేరు వుంది. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా నక్షత్రం. సందీప్ కిషమ్, సాయిధరమ్‌తేజ్, రెజినా, ప్రగ్యాజైస్వాల్, తనీష్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్, సాంగ్స్.. ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కమర్షియల్ డ్రామా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సందీప్ కిషన్.. ఎప్పటికైన ఎస్‌ఐ కావాలని ప్రయత్నిస్తు ఉంటాడు. డాన్స్ కొరియోగ్రాఫర్‌ అసిస్టెంట్ డాన్సర్‌గా రెజీనా పని చేస్తోంది. ప్రకాష్ రాజ్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అలెగ్జాండర్ ప్రేయసి అయిన పోలీస్ ఆఫీసర్ ప్రగ్యాజైస్వాల్. దేశానికి చిన్న చిన్న అసాంఘిక కార్యక్రమాలను చేస్తుండే వ్యక్తి తనీష్. సందీప్ కిషన్ జీవితంలోకి అనుకోకుండా అలెగ్జాండర్ ఎంట్రీ ఇస్తాడు. అసలు అలెగ్జాండర్ ఎవరు? ఇంతకీ సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? అందుకు సందీప్ కిషన్‌కు ఎదురైన అడ్డంకులేంటి? రెజినా-సందీప్‌ల మధ్య సంబంధమేంటి? చివరకు ఏం జరిగింది అనేదే నక్షత్రం కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన అందరూ అద్భుతంగా చేశారు. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కుర్రాడిగా బాగా చేశాడు. తన ఎమోషన్స్, ఇంటెన్సిటితో ఆకట్టుకున్నాడు. అలానే సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. రెజీనా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా బాగా చేసింది. తన పాత్ర వరకు పర్వాలేదనిపించింది. గ్లామర్‌తో కూడా పిచ్చెక్కించేసింది. సందీప్‌-రెజినాల కెమిస్ట్రీ బాగా పండింది. ఇక స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్‌తేజ క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్‌గా వుండటం విశేషం. అలెగ్జాండర్ పాత్రలో తేజ ఒదిగిపోయాడు. చాలా సెటిల్డ్, యాక్టివ్, పవర్ఫుల్‌గా నటించాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకుంది. తేజ్-ప్రగ్యాల కెమిస్ట్రీ బాగుంది. ప్రకాష్ రాజ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అద్భుతంగా చేశారు. అలాగే నెగెటివ్ పాత్రలో తనీష్ పర్వాలేదనిపించాడు. స్పెషల్ ఎంట్రీ సాంగ్‌లో శ్రియ బాగా చేసింది. ఇక మిగిత నటినటులు తమ పాత్రకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా కొనసాగినప్పటికీ.. ఇంటర్వెల్ బ్యాంగ్ సమయానికి మాత్రం ఒక ఎమోషన్‌తో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్‌లో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు రొమాన్స్, ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్‌తో కొనసాగుతుంది. కృష్ణవంశీ మరోసారి తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీకాంత్ నారోజ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సినిమాలో అక్కడ అక్కశ స్లోగా సాగుతోంది. సింపుల్ స్టోరీ లైన్‌ తీసుకొని సినిమాని తెరకెక్కించారు. కథనం ప్రకారం కొన్ని చోట్ల వర్కౌట్ అయినప్పటికీ.. కొన్ని కొన్ని చోట్ల విఫలమయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్తా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా అర్ధం అయ్యేలా ముగించేశారు.

మొత్తంగా :

కృష్ణవంశీ మరోసారి తన మార్క్ ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. కథ సింపుల్ గా ఉన్న కథనం పర్వాలేదు. ఒక్క మాటలో చెపాలంటే.. ఎమోషనల్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -