Thursday, April 25, 2024
- Advertisement -

నిన్ను కోరి మూవీ రివ్యూ

- Advertisement -
Nani Ninnu Kori Movie Review In Telugu

కొత్త కథలతో.. ఎప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు హీరో నాని. ఇప్పుడు అలాంటి భిన్నమైన రొమాంటిక్ కథ ‘నిన్ను కోరి’ సినిమాతో వస్తున్నాడు. కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయ్యింది. మరి నాని నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నివేదా “నాని” ని కలవడానికి వెళుతుండటంతో సినిమా మొదలవుతుంది. దారిలో తమ గతాన్ని గుర్తుతెచ్చుకుంటుతున్నారు ఇద్దరు. ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు లవర్స్. పీకల్లోతు ప్రేమలో మునిగిన ఇద్దరి మధ్య గొడవొచ్చి విడిపోతారు. కెరీర్ ముఖ్యమనుకొని నాని ఢిల్లీ కి వెళ్పోతాడు. కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేకపోతాడు. ఇంతలో నివేత ఆది ప్రేమలో పడుతుంది. ఆది కూడా నివేతను ప్రేమిస్తాడు. ట్విస్ట్ ఏంటి అంటే..నాని, ఆది ఫ్రెండ్స్. మరి చివరికి నివేత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఎవరు తమ ప్రేమను త్యాగం చేసారు? అసలు నాని-నివేత ఎందుకు విడిపోయారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే “నిన్ను కోరి” సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ శివ నిర్వాణ స్టోరీని.. క్లియర్ గా రాసుకోవడంతో సినిమా మొత్తం అలా కన్ఫ్యూజన్ లేకుండా సాగిపోతుంది. ఆ స్టోరీ కూడా పాత కథల్లా కాకుండా కొంచెం కొత్తగా ఉండేలా రాసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. పెళ్లి చేసుకుని కూడా ప్రేమించవచ్చు. ఒక్కసారి లవ్ లో విఫలమైతే లైఫ్ మరో అవకాశం ఇస్తోంది. వంటి వాస్తవాల్ని దర్శకుడు సున్నితంగా చెప్పాడు. సాధారణంగా ట్రయాంగిల్ ప్రేమ కథ అంటే ఎవరో ఒకరు త్యాగానికి పూనుకుని కథ చివర్లో కొంత బాధను మిగల్చడం పరిపాటి. కానీ ఈ సినిమా ముగింపు మాత్రం అలా కాకుండా ప్రేక్షకుడు ఓకే అనుకునేలా ఉండటం బాగుంది. ఇక మూవీకి మరొక ప్రధాన ప్లస్ పాయింట్ హీరో నాని. నాని టైమింగ్ పంచులు.. సెకండాఫ్లో నాని ఎమోషనల్ సీన్లలో చాలా అద్భుతంగా చేసాడు. అంతేగాక ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా బాగా చేసాడు. హీరోయిన్ నివేతా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడదని తపనపడే ప్రేయసిగా, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నోప్పించకూడదు అని ఆలోచించే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో ఆది చాలా బాగా చేసాడు. మొత్తంగా ముగ్గురు నేచ్యురల్ అప్పియరెన్స్ తీసుకొచ్చి.. సినిమా అందరికి కనెక్టయ్యేలా చేశాడు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్వించారు. గోపి సుందర్ సంగీతం పర్వాలేదు. డి. వి. వి దానయ్య పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. రెగ్యులర్ మాస్, కామెడీ ఎంటర్టైనర్లను పెద్దగా కనిపించవు. మొత్తం రొమాంటిక్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది. మాస్ కోరుకునే ప్రేక్షకులకు ఈ మూవీ పూర్తిస్థాయిలో మెప్పించకపోవచ్చు. క్లైమాక్స్ లో ఎమోషన్ ఉన్నా అది ఎక్కువసేపు ప్రేక్షకుడి మైండ్లో నిలబడే విధంగా లేకపోవడంతో ఈ బరువు సరిపోదు. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. సినిమా మొత్తంలో గుర్తిండిపోయే సీన్స్ లేకుండా ఫ్లాట్ గా వెళ్లిపోవడంతో.. ఎక్కడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగలేదు.

మొత్తంగా :

ఈ నిన్ను కోరి మూవీ.. ఇప్పుడు ఉన్న కాలానికి.. జనరేషన్ కి తగ్గ సినిమా. నిజానికి దగ్గరగా ఉండే స్టోరీ.. అందులోని పాత్రలు, మంచి నటన కనబర్చిన నటీనటులు, శివ నిర్వాణ స్టోరీని చెప్పిన విధానం, మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కనిపించగా.. ఎక్కడా ఎగ్జైట్మెంట్ కు గురిచేసే సన్నివేశాలు లేకపోవడం, నెమ్మదైన స్క్రీన్ ప్లే, పెద్దగా ఆకట్టుకోని సంగీతం మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సినిమా నాని సినిమాలను.. కొత్త కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

{youtube}cG50R8ZejhQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -