Tuesday, May 7, 2024
- Advertisement -

రజనీకాంత్ మరో ఎన్టీఆర్ అవుతారా? చిరంజీవి అవుతారా?

- Advertisement -

ఎప్ప‌టి నుండో ఎదురు చూస్తున్న రజనీ రాజకీయ ప్రవేశం జ‌రిగిపోయింది. రాజకీయ ప్రవేశం పై చాలా ఏళ్లుగా నాన్చుతున్న రజనీ, సమయం చూసి రాజకీయ అరంగేట్రం చేసారనే చెప్పాలి.త‌మిళ‌నాడులో ర‌జినికి తిరుగు లేని ఇమేజ్ ఉంది.ఇక్క‌డే ఒక ఆశ‌క్తిక‌ర‌మైన పోలిక తీస్తున్నారు అభిమానులు. రజనీ మ‌రో ఎన్టీఆర్ అవుతారా? లేదా చిరంజీవి అవుతారా? అనేది ప్ర‌జ‌ల‌లో ఆశ‌క్తి నేల‌కొంది.

తమిళనాడులో రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ కి సమానమైన క్రేజ్ తెలుగులో ఉన్న చిరంజీవి, రాజకీయాలలోకి వచ్చిన 2009 కరెక్ట్ సమయం కాదు. వైఎస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్న దశ అది. వైఎస్ ని అభిమానిస్తున్న రోజులవి. మరోపక్క ఆర్థికంగా, మీడియా పరంగా, ఇమేజ్ పరంగా బలమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నారు. అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టారు. మిగిలిన కారణాలు ఎలా ఉన్నా, చిరంజీవి సఫలం కాకపోవడానికి పరిస్థితులు కూడా ఒక కారణం. పరిస్థితుల రీత్యా రజనీ, చిరంజీవి కన్నా అడ్వాంటేజ్ లో ఉన్నారనే చెప్పాలి.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, దాదాపు అలాంటి పరిస్థితులే ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో పేరుకి రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. కాకపోతే ప్రజలకి నొప్పి తెలియకుండా సంక్షేమపథకాలు అమలు చేస్తుండడం వల్ల , తమిళ రాజకీయాలు ఆ రెండు పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. జయ మరణం తర్వాత, ఏఐఏడిఎంకె కుక్కలు చింపిన విస్తరికాగా, డిఎంకె ఒక్కటే కాస్త మెరుగుగా కనిపిస్తోంది. ఈ పరిస్థిల్లో రజనీ రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. రజనీకి అప్పట్లో ఎన్టీఆర్ కి ఉన్నంత సానుకూల వాతావరణం అయితే ఉంది.

రజనీ తమిళుడు కాదు, ఇది ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థులకి అస్త్రం కానుంది. తమ రాష్ట్ర రాజకీయాల్లో తమిళులు బిజెపి జోక్యాన్ని సహించడం లేదు. రజనీ బిజెపి సన్నిహితంగా ఉన్నారని, బిజెపి ప్రోద్బలంతోనే పార్టీ పెడుతున్నారని ప్రచారం ఉంది. ఈ ముద్ర రజనీ ఎలా వదిలించుకుంటారో చూడాలి. ఇక రజనీకాంత్ మ్యానిఫెస్టో, కుల సమీకరణలు ఈ రెండు చాలా కీలకం. వీటిని బట్టే ఆయన ఎన్టీఆర్ పొలిటిక‌ల్ హీరో అవుతారో లేక చిరంజీవిలా పొలిటిక‌ల్ జీరోగా అవుతారో కాల‌మే నిర్ణయం అవుతుంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -