Tuesday, May 7, 2024
- Advertisement -

రెమో మూవీ రివ్యూ!

- Advertisement -
remo movie review in telugu

తమిళంలో  శివ కార్తికేయన్, కీర్తి సురేష్ కాంభినేషన్ లో వచ్చిన చిత్రం ‘రెమో’. ఈ మధ్యే అక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాని తెలుగులో నిర్మాత దిల్ రాజు  ‘రెమో’ పేరుతో విడుదల చేశారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఎస్కె (శివకార్తికేయన్) అనే కుర్రాడు సినిమాలో హీరో కావాలనే లక్ష్యంతో సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో కావ్య (కీర్తి సురేష్) ను చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమెకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది. కానీ ఎస్కె మాత్రం ఎలాగైనా ఆమెలో ప్రేమ పుట్టించి తనను ప్రేమించేలా చేయాలని నిశ్చయించుకుని లేడీ నర్స్ గెటప్ లో కావ్య డాక్టర్ గా పని చేసే హాస్పిటల్లో చేరతాడు. ఆ గెటప్ లో ఎస్కె కీర్తికి ఎలా దగ్గరయ్యాడు ? ఆమెలో తన పట్ల ఎలా ప్రేమ పుట్టించాడు ? చివరికి ఆమెకు దగ్గరయ్యాడా ? లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది హీరో శివకార్తికేయన్ నటన గురించి. ఏ హీరో అయిన లేడీ గెటప్ వేస్తే… కొద్ది సేపు చూడాగలం. కానీ సినిమాలో శివకార్తికేయన్ లేడీ నర్స్ గెటప్ ధరిస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఇంకా కాసేపు చూడాలనిపించింది. దర్శకుడు బక్కియరాజ్ కన్నన్  లేడీ గెటప్ లో హీరోపై నడిచే సన్నివేశాలని బాగా చిత్రికరించారు. ఇక ఈ సినిమా ఫస్టాఫ్ లో హీరో, అతని ఫ్రెండ్, రౌడీల పై నడిచే కామెడీ సీన్స్ బాగానే పేలాయి. ఇక మరో ప్రధాన బలం హీరోయిన్ కీర్తి సురేష్. ఒక చిత్రంతోనే తెలుగువారికి బాగా దగ్గరైన ఆమె మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ లో హీరో – హీరోయిన్, హీరో – చిన్నపాప మధ్య నడిచే భావోద్వేగ పూరిత సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాల మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే… సినిమా ఫస్టాఫ్ బానే ఉన్న.. సినిమా నడుస్తున్న కొద్ది బోర్ కొట్టించింది. పైగా ఒక పాట మినహా మధ్యలో వచ్చే మిగతా పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేకుండా మరింత బోరింగ్ గా అనిపించాయి. ఇక సినిమాలో మరో పెద్ద మైనస్ పాయింట్ తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్సవడం. కథనం, సన్నివేశాల చిత్రీకరణ, పాత్రల సంభాషణ, ప్రవర్తన ఏవీ కూడా తెలుగుదనానికి దగ్గరగా కనబడలేదు. దాంతో రొమాంటిక్ ఫీల్ ఉన్నపటికీ సినిమా చూస్తన్నంత సేపు ఎక్కడో కాస్త అసంతృప్తి కలుగుతూనే ఉంది. సెకండాఫ్ క్లైమాక్స్ అన్ని సినిమాల్లాగే ఊహించదగ్గ ముగింపే పైగా ఎక్కువ సేపు సాగదీశారు కూడా.

మొత్తంగా:

తమిళంలో మంచి విజయం సాధించిన ఈ ‘రెమో’ సినిమా. తెలుగులో అన్ని రకల ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ సినిమా లేకపోవడం.. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే నెమ్మదించడం, రొటీన్ కథ కథనాలు కావడం ఇందులో మైన్స్ పాయింట్స్ . ఇక లేడీ గెటప్ లో శివ కార్తికేయన్ అద్భుత నటన, కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య సాగే లవ్ రొమాన్స్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, సినిమాకు ప్రేమ కథ నైపథ్యంగా ఉండటం వంటివి ప్లస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. రొమాంటిక్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

{youtube}s84nygJB8v8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -