Thursday, May 9, 2024
- Advertisement -

షేర్ : రివ్యూ

- Advertisement -

ఇక కళ్యాణ్ రాం కెరీర్ సంగతి అయిపోయినట్టే అనుకున్న సమయం లో ఊహించని విధంగా పటాస్ సినిమా తో పుంజుకోవడమే కాకుండా సూపర్ కలక్షన్ లు కూడా రాబట్టి తన స్టామినా ప్రూవ్ చేసాడు, ఆ ఫాంని కంటిన్యూ చెయ్యడం కోసం కళ్యాణ్ రాం షేర్ అంటూ మరొక ఎనేర్జేటిక్ టైటిల్ తో ఇప్పటికే తనకి వరుస ప్లాపు లు ఇచ్చిన మల్లిఖార్జున్ మీద భారం వేసి రంగం లోకి దిగాడు. ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్ తో ఆడియో విడుదల చేసినా హైప్ రాని షేర్ కి ప్రమోషన్ చాలా పేలవంగా ఉంది అని చెప్పి తీరాలి. 

 

స్టొరీ – స్ట్రాంగ్ పాయింట్స్ 

ఒక సాధారణ మధ్య తరగతి కుర్రాడి కథని డైరెక్టర్ తీసుకున్నాడు, సివిల్ ఇంజినీరింగ్ చేసిన హీరో ఒక లక్ష్యం మనసులో పెట్టుకుని కనీసం అమ్మాయిల వైపు కూడా చూడకుండా తన లక్ష్యమే పరమావధిగా బతుకుతూ ఉంటాడు. తన ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే కళ్యాణ్ రాం కి అనుకోకుండా తారస పడిన ఒక అమ్మాయి లవ్ లో పడేస్తుంది. ఇలా ఆమె తో ప్రేమలో మునిగిఉన్న సమయంలో అనుకోని రెండు సంఘటనలు వెంట వెంటనే అతన్ని బలంగా తాకుతాయి. ఒకటి కుటుంబానికి సంబంధించినది కాగా మరొకటి తన ప్రేయసి ది . ఈ రెండింటి మధ్యా చిక్కుకుపోయి తన ప్రేయసిని త్యాగం చెయ్యడం తప్ప మరేమీ చెయ్యలేని అచేతన స్థితి లో పడిపోతాడు కళ్యాణ్ రాం. ఒకరి కోసం ఒకరిని ఒడులుకోలేక చివరకి తన లక్ష్యాన్ని సైతం పక్కకి నెట్టేసే పరిస్థితి కి వస్తాడు. దాని తరువాత తన ప్రేమనీ, కుటుంబాన్నీ కాపాడుకోవడం కోసం హీరో ఏం చేసాడు ఎలాంటి లక్ష్యాన్ని త్యాగం చేసాడు, చివరకి ఆ లక్ష్యం ఏ రకంగా తనదగ్గరకి వచ్చి చేరింది అనేది కథ ..

కళ్యాణ్ రాం పెర్ఫార్మెన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. డైలాగ్ డెలివరీ లో మరొక నందమూరి హీరో వచ్చేసాడు అని చెప్పాలి. తాను పెట్టిన హార్డ్ వర్క్ అంతా తెరమీద కనిపించింది. ఈ సినిమాకి ఏకైక పాజిటివ్ కళ్యాణ్ రాం మాత్రమె. సోనాల్ చౌహాన్ పరవాలేదు అనిపించింది. కామెడీ చాలా చోట్ల బాగా వర్క్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు ఉన్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది, యాక్షన్ ఎపిసోడ్ లో బాగా కుదిరాయి. ఈ సినిమా కి ఫైట్ లు పెద్ద అసట్ అని చెప్పాలి. రిఫరెన్స్ లు వాడడం పరవాలేదు అనిపించారు. 

వీక్ పాయింట్ లు ::

ఈ సినిమా కి మేజర్ మైనస్ సెకండ్ హాఫ్ , అందులో కూడా మొదట పరవాలేదు అన్నట్టు కథ నడిపించి ఆఖరి ఇరవై ఐదు నిమిషాలూ డ్రాగ్ చేసేసి విసిగించాడు దర్శకుడు. కొన్ని సీన్ లలో ఎడిటింగ్ చాలా పూర్ గా సాగింది. చాలా మటుకూ లాజిక్ లు మిస్ అవుతూ నిరంతరం ఇబ్బంది పెట్టాయి. లాజిక్ లు ఒకటి రెండు అయితే అనుకోవచ్చు భారీగా మెయిన్ కథలో లాజిక్ మిస్ అయ్యాడు దర్శకుడు. ఈ మధ్య కాలం లో రొటీన్ సబ్జెక్ట్ లు జనం ఛీ కొడుతున్నారు అని తెలిసి కూడా మళ్ళీ అలాంటి కథనే ఎంచుకున్నాడు, స్క్రీన్ ప్లే అస్సలు గ్రిప్పింగ్ గా లేనేలేదు. పేలవంగా సాగింది. ఫైట్ లు బాగున్నాయి అనుకున్న క్రమం లో తరవాత వచ్చే సీన్ ఆసక్తిని క్రియేట్ చెయ్యడం లో ఫెయిల్ అవుతోంది . నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు  చూసీ… చూ………….సీ విసిగిపోయాం. ఈ సినిమాలోనూ ఆ ట్రిక్ మెప్పించ‌లేదు. క‌థ లైన్ బావుంద‌న్న మాట నిజ‌మే. కానీ ఎగ్జిక్యూష‌న్‌లో తేడా వ‌చ్చింది.విలనిజం మరీ పేలవంగా ఉంది  విలన్ లని ముగ్గురు జోకర్లని పెట్టినట్టు సాగించాడు.

మొత్తంగా :

కథ బాగున్నా కథకి తగ్గ సన్నివేశాలు సమకూర్చలేక పోవడం దర్శకుడి ప్రతిభ ని నీరు గార్చేసింది. అస్సలు ఒక్క సీన్ కూడా ఆఖరి ఇరవై ఐదు నిమిషాల్లో చూడాలి అనిపించేలా లేదు. మరీ ఖాళీగా ఉంటె తప్ప ఒక్కసారి కూడా చూడ్డం దండగ అనిపిస్తుంది, బాగా డ్రాగ్ చేసి కళ్యాణ్ రాం తన మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసాడు దర్శకుడు. పూర్తిగా రొటీన్ కథ తో వెళ్ళిపోతే అసలు లాజిక్ లు గాల్లో కలిపేయడం ఈజీ అనుకున్నాడో ఏమో కానీ పటాస్ లాంటి సూపర్ హిట్ తరవాత కళ్యాణ్ రాం నుంచి రావాల్సిన సినిమా ఖచ్చితంగా కాదు ఇది. రోజూ వండే ఉప్మానే బోర్ అంటే దాన్ని కూడా సరిగ్గా వండకపోతే ఎలా చిరాకు వస్తుందో అలా చిరాకు తెప్పించింది ఈ చిత్రం .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -