Sunday, April 28, 2024
- Advertisement -

‘శ్రీకారం’ మూవీ రివ్యూ!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’తో తన నటనకు ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్.. హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో రైతు కష్టాలు.. గౌరవాన్ని గురించి చక్కగా చూపించారు. ఇదే బాటలో నడుస్తూ.. బి. కిశోర్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ వ్యవసాయంలో కొత్త ఒరవడికి ‘శ్రీకారం’ చుట్టారు. పల్లెటూళ్లలోని ఆప్యాయత, ప్రేమ, రైతుల కష్టనష్టాలను వివరిస్తూ శ్రీకారం సినిమాతో మహా శివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్.

కథ :

చిత్తూరు జిల్లాలోని అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. తన ఆఫీస్ లో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు కార్తీక్. ఈ క్రమంలోనే చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) అనే అమ్మాయి లవ్ లో పడేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది.

వ్యవసాయం దండగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు కార్తీక్. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే ఈ చిత్ర కథాసారాంశం.

విశ్లేషణ :
‘శ్రీకారం’తో వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. కష్టపడి పొలం పని చేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కథ అందరికీ తెలిసినా దాన్ని కొత్త పద్ధతిలో చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ కిశోర్.

నటీనటులు:
ర్వానంద్‌ ఈ సినిమాలోనూ తన నటనతో మెప్పించారు. కంప్యూటర్‌ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్‌వేర్‌ పొలంలోకి దిగితే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ మెప్పించింది. నటన పరంగాను, గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది‌. నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్‌ ఒదిగిపోయారు. హీరో తల్లిగా ఆమని తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక వీకే నరేశ్‌ ఈ సినిమాకు మరో ముఖ్య పాత్ర. కార్తీక్ మామ పాత్రలో ఎమోషన్స్ పండించారు. మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతివర్గం :

మిక్కీ జె. మేయర్ సంగీతం పర్వాలేదనిపించేలా ఉంది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రంగానే ఉన్నాయి. పాటల సంగతి పక్కన పెడితే ఎమోషన్స్ పండించే విషయంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కెమెరా పనితీరు చాలా అద్భుతంగా ఉంది.

ప్లస్ : శర్వానంద్ నటన, వ్యవసాయం

మైనస్ : రొటీన్ స్టోరీ, కొన్ని బోరు సీన్లు

బాటమ్ లేన్: వ్యవసాయానికి కొత్త ‘శ్రీకారం’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -