ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలివే..

థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మరో రెండు భారీ చిత్రాలు మూవీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కన్నడ, కోలీవుడ్‌ సినిమాలే అయినా.. తెలుగులోనూ ఈ మూవీస్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండటం విశేషం. అందుకు ప్రధాన కారణం ఆ సినిమాల హీరోలే. ఒకరు ‘కేజీఎఫ్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్‌ అయితే తమిళ స్టార్‌ హీరో, దళపతి విజయ్‌ మరొకరు. వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు ఈ వారం థియేటర్లలో హల్‌చల్‌ చేయనున్నాయి. ఈ చిత్రాలతో పాటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూద్దాం.

  1. బీస్ట్‌

కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘బీస్ట్’. విభిన్న కథలతో అలరిస్తున్న డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘అరబిక్ కుత్తు’ పాట‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ట్రైలర్‌ భారీగా అంచనాలు పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్‌ 13న ఈ మూవీ విడుదల కానుంది.

  1. కేజీఎఫ్‌: చాప్టర్2
    ‘కేజీఎఫ్‌ 1’లో గరుడను రాకీ భాయ్‌ చంపేసిన తరువాత ఏం జరిగింది? గరుడ తర్వాత కేజీఎఫ్‌ను దక్కించుకునేందుకు అధీరా ఏం చేశాడు ? అనే ప్రశ్నలతో ‘కేజీఎఫ్: చాప్టర్‌ 2’ ప్రేక్షుకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఏప్రిల్‌ 14న కేజీఎఫ్‌2 ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో యశ్‌ , డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా ‘కేజీఎఫ్‌ 1’ స్వీక్వెల్ గా తెరకెక్కుతోంది.

ఇక ఇదే రోజున బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్‌ నటించిన ‘జెర్సీ’ విడుదల కావాల్సింది. కానీ ‘కేజీఎఫ్‌ 2’, ‘బీస్ట్‌’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు:
1.గాలివాన (వెబ్‌ సిరీస్‌): ఏప్రిల్‌ 14(జీ5)
2.ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్‌ 14 (సోనీలివ్‌)
3.దహనం: ఏప్రిల్‌ 14 (ఎంఎక్స్‌ ప్లేయర్‌)
4.బ్లడ్‌ మేరీ: ఏప్రిల్‌ 15 (ఆహా)

అయేషా టాకియాకు చేదు అనుభవం

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

Related Articles

Most Populer

Recent Posts