Friday, May 3, 2024
- Advertisement -

తెలంగాణ ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరూ!

- Advertisement -

తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుండగా 29న పోలింగ్ జరగనుంది. రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది.

ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్ధికి 40 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఒక అభ్యర్ధిని నిలబెట్టనుంది. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఒక అభ్యర్థిని పోటీకి నిలబెట్టనుంది. ఒక వేళ కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే ఓటింగ్ అనివార్యం కానుంది.

అమితే ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ లేకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్‌కు అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి దాసోజు పేరును గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ ప్రతిపాదించగా దానిని పెండింగ్‌లో పెట్టారు తమిళి సై. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో శ్రవణ్‌ ఎమ్మెల్సీ కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అద్దంకి దయాకర్‌ గత ఎన్నికల్లో టికెట్ రాకున్న కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేశారు. సో మొత్తంగా ఇద్దరు ఉద్యమకారులు పెద్దల సభకు వెళ్లనున్నారనే టాక్ నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -