Saturday, April 27, 2024
- Advertisement -

కామ్రేడ్లతోనే కలిసి వెళ్తాం!

- Advertisement -

ఏపీలో వైసీపీ సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేయనుండగా ప్రతిపక్షాలు మాత్రం జట్టుగా వస్తున్నాయి. ఇక టీడీపీ – జనసేన – బీజేపీ ఒక కూటమిగా రానుండగా తాజా మరో కూటమి రెడీ అయింది. సీపీఐ, సీపీఎంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల.ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు షర్మిల.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా కామ్రేడ్లతో కలిసి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. వైసీపీని ఢీ కొట్టాలంటే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుతోనే సాధ్యమని వస్తున్న వార్తలను షర్మిల ఖండించారు.

ఈ నెల 26 న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపిన షర్మిల…అదే సభలో వామపక్షాలతో పొత్తు, సీట్ల షేరింగ్ పై క్లారిటీ ఇస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇదే స్ట్రాటజీని అనుసరించింది. సీపీఎం పొత్తుకు ఒప్పుకోకపోయినా సీపీఐతో పాటు కొదండరాం పార్టీతో కలిసి అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఏపీలో అధికారం వచ్చే అవకాశం లేకపోయినా కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -