Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్‌కే మొగ్గుచూపాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ నేతలు ఆల్ రెడీ గెలిచిపోయామన్న ధీమాలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక తరహాలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్. అభ్యర్థులందరిని క్యాంపుకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వరకు ఓ చోట రహస్యంగా దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇందుకోసం కర్ణాటకలో ఓక్యాంపును ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు.ఎలాంటి పొరపాట్లు జరగకుండా గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసినట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి బాధ్యులను నియమించి.. సదరు అభ్యర్థులు గెలిచినట్లుగా క్లారిటీ తీసుకున్న వెంటనే కర్ణాటక తరలించే చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -