Saturday, April 27, 2024
- Advertisement -

టీకాంగ్రెస్‌లో తారాస్థాయికి విభేదాలు!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెడ్డి వర్సెస్ బీసీగా తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ముఖ్యంగా బీసీ నేతలు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివ‌ర‌కు తొమ్మిది స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించింది. ఇందులో రెండు ఎస్సీ, ఒక‌టి ఎస్టీ రిజ‌ర్వుడు స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రక‌టించింది. మిగ‌తా ఆరు స్థానాల్లో కేవ‌లం రెండు మాత్రమే బీసీల‌కు కేటాయించింది. ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్‌లో ఉండ‌టంతో వీటిలో క‌నీసం నాలుగు స్థానాలు బీసీల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే నామినేటేడ్ పోస్టుల రచ్చ కొనసాగుతోంది. తమకు కేటాయించిన పోస్టులపై కొంతమంది బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఖ‌మ్మం టికెట్ కోసం సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు డిమాండ్ చేస్తుండగా ఆయనకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భువ‌న‌గిరి నుంచి పున్న కైలాష్ నేత టికెట్ ఆశీస్తుండగా సీటు రాకపోతే రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది.

అయితే ప్రధానంగా అందరి టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డే కానున్నారు. తన అనుచరగణానికి రేవంత్ పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -