Tuesday, April 30, 2024
- Advertisement -

నల్లారి ఫ్యామిలీకి భంగపాటేనా?

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలు. చాలా కాలం ఒకే పార్టీలో పనిచేసినా శత్రుత్వం మాత్రం చాపకింద నీరులానే ఉంది. అయితే తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి అధికార వైసీపీలో ఉండగా ,నల్లారి కిరణ్ బీజేపీలో, ఆయన తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.

రాజంపేట పార్లమెంట్‌లో బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నుండి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మధ్య పోరు జరగనుండగా పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా కిషోర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లారి బ్రదర్స్‌ని ఓడించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు పెద్దిరెడ్డి.

కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌పై అనేక కుట్రలు చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ ఫ్యామిలీని రాజకీయంగా ఓడించేందుకు స్కెచ్ వేస్తున్నారు పెద్దిరెడ్డి. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో చిత్తూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కగా ఈ ఇద్దరిని ఓడించేందుకు పెద్దిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -