Wednesday, May 8, 2024
- Advertisement -

ఖమ్మం… కాంగ్రెస్‌కు పెద్ద టాస్క్‌!

- Advertisement -

తెలంగాణ ఎంపీ సీట్ల అంశం దాదాపు కొలిక్కి తెచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గానూ 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఖమ్మం, హైదరాబాద్, కాంగ్రెస్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఇక వరంగల్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యకు కేటాయించింది.

మిగిలిన మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ చేస్తోంది కాంగ్రెస్. ప్రధానంగా ఖమ్మం స్థానానికి అభ్యర్థి ఎంపిక తలకు మించిన భారంగా మారింది. ఈ స్థానం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉండగా ఎవరికనే దానిపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.

అయితే పొంగులేటి అయితేనే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ నేతలు సైతం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఇక కరీంనగర్ సీటు కోసం తీన్మార్ మల్లన్న , మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతుండగా హైద‌రాబాద్‌లో బ‌ల‌మైన మైనారిటీ నేతకు ఇస్తారని టాక్ నడుస్తోంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -