Tuesday, April 30, 2024
- Advertisement -

నందిగామ…ఈసారి జగన్‌దే!

- Advertisement -

నందిగామ..ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపికే. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ,దేవినేని ఉమా వంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నాలుగు దశాబ్దాల్లో రెండు సార్లు తప్ప అన్ని సార్లు గెలుపు టీడీపీదే. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుగా మారగా 2009, 2014 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణించిన తర్వాత తంగిరాల సౌమ్య గెలవగా 2019లో జగన్ సునామీలో వైసీపీ విజయఢంకా మోగించింది.

నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఓటర్లు ఉండగా ఇందులో కమ్మ సామాజికవర్గం 35 వేలు ,కాపు సామాజిక వర్గానికి 20 వేలు, బీసీలు సుమారు ఓటర్లు 80 వేల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ నేతల ఆధిపత్యమే ఎక్కువ. ఎందుకంటే ఎక్కువసార్లు గెలిచింది ఆ సామాజికవర్గం వారే.

గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ నేత మొండితోక జగన్మోహనరావు. అలాగే జగన్మోహన్ రావు సోదరుడు అరుణ్‌కుమార్‌ను ఎమ్మెల్సీగా నియమించారు జగన్. ఇద్దరు ఈ ఐదేళ్లలో నియోజకవర్గంపై పట్టు సాధించడమే కాదు అభివృద్ధి పథంలో నడిపించారు. ఇక టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తలపడుతుండగా ఈ సారి గెలిచి పట్టు నిలుపుకోవాలని ఆమె భావిస్తున్నారు.

ఇక ప్రధానంగా ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరగని పనులను ఎలా నెరేవర్చామో వివరిస్తు ముందుకు సాగుతున్నారు వైసీపీ అభ్యర్థి. 40 ఏళ్లలో టీడీపీ చేయలేనిది నాలుగేళ్లలో తాము చేసి చూపించామని ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. ఈసారి గెలిస్తే రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. వీరికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తోడవడంతో గెలుపు ఖాయమైందని…ఇప్పుడు తాము మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని చెబుతున్నారు. మొత్తంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామలో ఈసారి ఫ్యాన్ గాలి వీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -