Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్‌కు కొత్త తలనొప్పి..!

- Advertisement -

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో భాగంగా 50కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నేతలు ఒత్తిడి తెస్తుండగా మరోవైపు కొన్ని స్ధానాల్లో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతుండటం పవన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రధానంగా జనసేన 2019 ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక స్థానం రాజోలు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే…వైసీపీలో చేరారు.

ఇక ఆ తర్వాత జనసేన పార్టీలో పోటీ చేసేందుకు ఆశావాహుల పెరిగిపోయింది. ప్రధానంగా రాపాక రమేష్‌ బాబు, దేవ వరప్రసాద్ ,బొంతు రాజేశ్వరరావు మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. రమేష్ బాబు స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరనా సమయంలో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక మరో నేత దేవ వరప్రసాద్. రిటైర్డ్ ఐఏఎస్, పవన్‌కు అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి వాటిని చెంది జనసేన పార్టీలో చేరారు.ఈసారి టికెట్ తనకేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేతల మధ్య పోరు బాగానే ఉన్నా సీటు ఎవరికి ఇవ్వాలోనన్న దానిపై మాత్రం పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు. మరి రాజోలు సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -