Thursday, May 2, 2024
- Advertisement -

టీబీజేపీలో జోష్..తెలంగాణ నుండి మోడీ పోటీ!

- Advertisement -

భారీ అంచనాల మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది. అధికారంలోకి వస్తామని అంచనా వేసినా కేవలం సింగిల్ డిజిట్‌కే ఆ పార్టీ పరిమితమైంది. దీంతో ఎన్నికల్లో ఓటమికి గల కారణలు, త్వరలోనే జరిగే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు కమలనాథులు. అయితే ఓటమిపై బండి సంజయ్ వర్గం ఈటల రాజేందర్‌పై, ఈటల వర్గం బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

అయితే పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ హైకమాండ్ దృష్టి సారించగా తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది. త్వరలోనే జరిగే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుండి ప్రధాని మోడీ బరిలో దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో సహా దక్షిణాదిపైన ప్రభావం ఉండేలా ప్రధాని పోటీచేయనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మల్కాజ్‌గిరి నుండి మోడీ పోటీ చేయనున్నారని ఇందుకు రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసిందని నేతలు చెబుతున్నారు.

వాస్తవానికి మోడీ తమిళనాడు నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ పేరు వినిపిస్తుండటంతో బీజేపీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ మల్కాజ్‌గిరి నుండి పోటీ చేస్తే తెలంగాణతో పాటు దక్షిణాది మిగితా రాష్ట్రాలపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీకి ఒక్క కర్ణాటకలో తప్ప మిగితా రాష్ట్రాల్లో పెద్దగా ప్రాబల్యం లేదు. ఎప్పటినుండో దక్షిణాదిన విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యపడటం లేదు. అందుకే మోడీ దక్షిణాది నుండి పోటీ చేస్తారని కొద్దిరోజులుగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తుండగా తాజాగా తెలంగాణ పేరు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -