Tuesday, April 30, 2024
- Advertisement -

సుప్రీంలో బీఆర్ఎస్‌కు షాక్!

- Advertisement -

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించొద్దు అని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా? ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.అయితే మునుగోడు ఉప ఎన్నిక‌లో కారును పోలిన గుర్తుల‌తో నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొంది బీఆర్ఎస్. అయితే హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయస్ధానంలో ఊరట లభించకపోవడంతో ఇక బీఆర్ఎస్ పోటీ చేసే ప్రతీ చోటా రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు ఉండనున్నాయి.

వాస్తవానికి కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్‌ఎస్‌కు చాలా నష్టం జరిగింది. ముఖ్యంగా దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలవడానికి రోడ్డు రోలర్ కారణమైంది. అలాగే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పలుచోట్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలుకాగా ఇందులో కారు గుర్తును పోలిన గుర్తులే దెబ్బతీశాయి. సుప్రీంలో షాక్ తగిలిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. ఇది బీఆర్ఎస్ కు ఇబ్బందికరమేనని రాజకీయవర్గాలు చెబుతున్నయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -