Sunday, April 28, 2024
- Advertisement -

టీడీపీతో బీజేపీ..అభ్యర్థులు అలర్ట్!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బీజేపీతో పొత్తు దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఇక పొత్తు ఖరారు కావడం, ప్రకటనే తరువాయి కావడంతో బీజేపీ నుండి పోటీచేయాలని భావిస్తున్న ఆశావాహులు అలర్ట్ అయ్యారు. అయితే పొత్తులో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారో తెలియాల్సి ఉంది.

ఇక జనసేనకు 25 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా బీజేపీ 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు,5 నుంచి ఏడు పార్లమెంట్‌ స్థానాలు ఆశీస్తోంది. విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, నర్సాపురం, అరకు, హిందుపురం ఎంపీ స్థానాలు ఆశిస్తుండగా విశాఖ నార్త్‌, పి.గన్నవరం, రాజమండ్రి అర్బన్‌, తాడేపల్లిగూడెం, కైకలూరు, తంబళ్లపల్లె, కదిరి, జమ్మలమడుగు, ధర్మవరం, ఒక ఎస్టీ సీటును కోరనుందని సమాచారం.

విశాఖపట్నం నుండి జీవీఎల్‌ నరసింహరావు/ సీఎం రమేశ్‌, రాజమండ్రి నుండి పురందేశ్వరి, రాజంపేట – నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి,తిరుపతి – రత్నప్రభ, రిటైర్డ్‌ ఐఏఎస్‌,అరకు – కొత్తపల్లి గీత,హిందూపురం – సత్యకుమార్‌/ స్వామి పరిపూర్ణానంద సీటు ఆశీస్తున్నారు. ఇక ఎమ్మెల్యే స్థానాల విషయానికొస్తే విశాఖ ఉత్తర – విష్ణుకుమార్ రాజు, విశాఖ తూర్పు – మాధవ్,రాజమండ్రి సిటీ – సోము వీర్రాజు,పి.గన్నవరం – మానేపల్లి అయ్యాజివేమ,కైకలూరు – కామినేని శ్రీనివాస్,తిరుపతి – భానుప్రకాశ్‌ రెడ్డి,తంబళ్లపల్లె – చల్లా నరసింహారెడ్డి,శ్రీకాళహస్తి – కోలా ఆనంద్‌,గుంటూరు వెస్ట్‌ – వల్లూరి జయప్రకాష్ నారాయణ,ధర్మవరం – గోనుగుంట్ల సూర్యనారాయణ,కదిరి – విష్ణువర్ధన్‌రెడ్డి,జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి సీటు ఆశీస్తున్న వారిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -