Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ – బీజేపీ పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన!

- Advertisement -

ఏపీ రాజకీయాలు హస్తినకు చేరాయి. టీడీపీ – జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీ ఓకే చెప్పినట్లు సమాచారం. గురువారం ఢిల్లీలో అమిత్‌ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు, పవన్. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల పంపకాలపై చర్చ జరిగింది.

అయితే బీజేపీ మొదటి నుండి ఊహించినట్లుగానే ఎక్కువ ఎంపీ స్థానాలను కోరింది. కనీసం 6 ఎంపీ స్థానాలు ఇవ్వాలని అమిత్ షా తన ప్రతిపాదనను చంద్రబాబుకు చెప్పగా టీడీపీ – జనసేనకు కలిపి 6 ఎంపీ సీట్లు ఇస్తానని బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నాలుగు ఎంపీ,ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవ్వగా బీజేపీ మాత్రం 6 ఎంపీ,10 అసెంబ్లీ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉండగా బీజేపీ రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు నియోజకవర్గాలు కోరిందని తెలుస్తోంది. దీంతో 2014లో తాము పోటీచేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ కోరుతుండటంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇవాళ మరోసారి భేటీ తర్వాత క్లారిటీ వస్తే ఎన్డీయే కూటమిలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -