కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

- Advertisement -

వెండితెర‌పై విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోసిషిస్తూ క‌థానాయ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీ. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ కార్తీకి మంచి మార్కెట్ ఉంది. ఆయ‌న తీసే ప్ర‌తి సినిమా కూడా త‌న బ్ర‌ద‌ర్, ప్ర‌ముఖ హీరో సూర్య మాదిరిగా తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల‌య్యే విధంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటాడు.

ఇదివ‌ర‌కు తెర‌పై విభిన్న కథాంశాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన కార్తీ.. ప్ర‌స్తుతం సూల్తాన్‌గా వెండితెర‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన సినిమాలో భారీ తారాగ‌ణం న‌టించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు… శుక్ర‌వారం నాడు ఈ సినిమా విడుద‌ల అవుతోంది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ ర‌ష్మిక మంధ‌న హీరోయిన్ గా న‌టిస్తోంది.

- Advertisement -

కోలీవుడ్‌లో ర‌ష్మిక మంధ‌న‌కు ఇది మొద‌టి సినిమా. కాగా, ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే సూల్తాన్ సినిమాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించాడు కార్తీ. తాను ఎక్క‌డికి వెళ్లిన అంద‌రూ ఖైదీ సినిమా సిక్వెల్ గురించే అడుగుతున్నారని వెల్ల‌డించారు. ఖైదీకి సిక్వెల్ ఉంద‌నీ, త్వ‌ర‌లోనే ప‌ట్ట‌లెక్క‌నుంద‌ని చెప్పాడు. కాగా, కార్తీ న‌టించిన ఖైదీ సినిమా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

రంగుల కేళీ.. సంబురాల హోలీ !

అభినవ ఉసేన్ బోల్ట్‌.. కంబ‌ళ వీరుడి స‌రికొత్త రికార్డు !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -