Friday, May 3, 2024
- Advertisement -

కృష్ణపట్నంలో రాత్రి హై డ్రామా.. ఆనందయ్యను రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు..!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఈ గ్రామం హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఇస్తున్న మందు పై వివాదం మొదలైంది. ఈ మందు పంపిణీ చేస్తున్న కొత్తలో కరోనా నయం అవుతుందని తండోపతండాలుగా అక్కడికి జనం వెళ్లారు. దాంతో ఈ విషయం కాస్త మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన మందును పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆనంద‌య్య క‌రోనా మందుపై ఇవాళ తుది నివేదిక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని శుక్ర‌వారం ప్ర‌క‌టించారు ఏపీ ఆయుష్ క‌మిష‌న‌ర్ రాములు నాయ‌క్.. అయితే, వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వులు రావ‌డంతో.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నివేదికకు మరో రోండు రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశంఉంది.. ఇవాళ, రేపు కేంద్ర సంస్థలకు సెలవు కావడంతో నివేదిక సోమవారమే అంటున్నారు నిపుణులు.. అత్యవసరంగా భావిస్తే తప్ప ఇవాళ నివేదిక రావడం అనుమానమే అంటున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేసే ఆనందయ్యను పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్టు సమాచారం. కాగా, ఆనందయ్య ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని సమాచారం.

కరోనా తో ప్రముఖ నిర్మాత కన్నుమూత

‘శ్రీకారం’ నిర్మాతలకు హీరో శర్వానంద్ లీగల్ నోటీసులు?

నేటి పంచాంగం, శనివారం (29-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -