నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర యాంకర్.. ఎవరంటే?

- Advertisement -

బుల్లితెరపై రష్మీ గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌, ఢీ షోలతో రచ్చచేస్తూనే అడపా దడపా సినిమాలు చేస్తూ అందాలను కనువిందు చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.రష్మి గౌతమ్ కి బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను,తన కెరీర్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంటుంది.

ఈహాట్ బ్యూటీ రష్మి గౌతమ్ వెండితెరకు గుంటూరు టాకీస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తరువాత అంతకు మంచి, శివరంజని, నెక్స్ట్ నువ్వే,రాణి గారి బంగ్లా, ఇలా చాలా సినిమాలు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయిన ఈ బ్యూటీకి వెండి తెరపై తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అనే మూవీలో నటిస్తోంది.

- Advertisement -

Also read:ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

తాజాగా రష్మి గౌతమ్ కు నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మి గౌతమ్ ఓ కీలకమైన పాత్రలో నటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తైంది.సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాగానే రష్మీ జాయిన్ అవుతుందని తెలుస్తోంది.రష్మి గౌతమ్ ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -