గోపిచంద్​ మలినేని.. బాలయ్య సినిమాకు చిన్న బ్రేక్​.. కారణం అదే..!

- Advertisement -

బాలయ్య.. యువ దర్శకుడు గోపిచంద్​ మలినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలకృష్ణ బర్త్​డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే గోపిచంద్​ .. బాలయ్యకు కథను వినిపించాడట. అయితే ఈ కథలో చిన్న చిన్న మార్పులు బాలకృష్ణ సూచించినట్టు సమాచారం.

గోపిచంద్ మలినేని ‘డాన్​శీను’ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత రవితేజతో బలుపు, ఇటీవల వచ్చిన క్రాక్​ సైతం సక్సెస్​ అయ్యాయి. ఇక సాయిధరమ్​ తేజ్ తో విన్నర్​ సినిమా తీశాడు. గోపిచంద్​ చాలా కాలం పాటు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్​గా పనిచేశాడు. అతడి చిత్రాల్లో ఆ కామెడీ మార్కు కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రాక్​ సినిమాతో రవితేజకు హిట్​ ఇచ్చాడు. దీంతో అతడు మళ్లీ గాడిలో పడ్డాడు. అయితే క్రాక్​ హిట్​ కావడంతో బాలయ్య .. గోపిచంద్​ కు చాన్స్​ ఇచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో అఖండ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గా కనిపిస్తున్నాడు. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తికాగానే.. గోపిచంద్ తో మూవీ తీసే అవకాశం ఉంది. అయితే గోపిచంద్​ చెప్పిన కథలో బాలకృష్ణకు క్లైమాక్స్​ నచ్చలేదట. హీరో ఎలివేషన్స్​కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా నచ్చలేదట. దీంతో మార్చమని ఆయన సూచించాడని టాక్​. ఇందుకోసం గోపిచంద్​ మూడు నెలల టైమ్​ తీసుకున్నాడట. ఆ తర్వాతే ఈ మూవీకి సెట్స్​ మీదకు రాబోతున్నది.

Also Read

ఆచార్య చిత్రంలో శ్రీశ్రీ కవితలు..!

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -