‘ కౌన్ బనేగా కరోడ్ పతి’ పై కేసు.. ఆ ఒక్క ప్రశ్నవల్లే..!

- Advertisement -

బాలీవుడ్‌‌ బిగ్‌‌బీ అమితాబ్‌‌ బచ్చన్‌‌ యాంకర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి’ సీజన్‌‌ 12పై పోలీసులు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా బిగ్ బీ అమితాబచ్చన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఎంతో క్రేజ్ ఉంది. ఒకదశంలో బిగ్ బీ లైఫ్ టర్నింగ్ చేసిన షో ఇది అంటారు. అయితే ప్రస్తుతం ఈ షో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఓ ఎపిసోడ్ లో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఓ ప్రశ్న అడిగారని లక్నోకు చెందిన ఓ వ్యక్తి కంప్లైంట్ చేసాడు. గత శుక్రవారం కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారమైంది. అయితే ఈ ఎపిసోడ్ లో రూ.6.40 లక్షల ప్రైజ్ మనీ కోసం ఓ ప్రశ్న అడిగారు.

ఈ ప్రశ్న వలెనే  కౌన్ బనేగా కరోడ్ పతి” షో వివాదంలో చిక్కుకుంది. శుక్రవారం నిర్వహించిన కేబీసీ ఎపిసోడ్‌‌లో సోషల్‌‌ యాక్టివిస్ట్‌‌ విల్సన్‌‌, నటుడు అనూప్‌‌ సోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌‌ వారిని ఒక క్వశ్చన్‌‌ అడిగారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌‌‌‌ అంబేడ్కర్‌‌‌‌ 1927 డిసెంబర్‌‌‌‌ 25న ఏ గ్రంథ ప్రతులను కాల్చేశారు? అని అడిగారు.

విష్ణు పురాణం, భగవద్గీత, రుగ్వేద, మనుస్మృతి ఆప్షన్స్‌‌ ఇచ్చారు. కుల వివక్ష, అస్పృశ్యతను ప్రోత్సహించేలా ఉందని మనుస్మృతిని అంబేడ్కర్‌‌‌‌ తగలబెట్టారని అమితాబ్‌‌ చెప్పారు. అమితాబ్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ” కేబీసీని కమ్యూనిస్టులు హైజాక్ చేస్తున్నారని” ట్విట్టర్ మాధ్యమంలో ఆగ్రహం వ్యక్తం చేసారు.

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -