రూ. 200 కోట్లతో పట్టాలపైకి బాబాయ్- అబ్బాయ్ మూవీ!

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ –రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మూవీ కోసం మెగా అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరి సినిమాకు స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తే.. రికార్డులన్నీ బద్దలు కావాల్సిందే. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న నిర్మాణ సంస్థ‌లో చ‌ర‌ణ్ తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ.. అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రావ‌డం లేదు. అలాగే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకట మాత్రం రాలేదు.

ఇక తాజాగా మరోసారి బాబాయ్‌-అబ్బాయ్‌ సినిమా గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శంకర్‌ దర్శకత్వంలో ఈ క్రేజీ మల్టీస్టారర్‌ పట్టాలెక్కబోతుందని ఈ వార్త సారాంశం. గతంలో శంకర్ రూపొందించిన సినిమాల మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా దీన్ని రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఇక డైరెక్టర్‌ శంకర్‌కు కూడా రోబో తర్వాత సాలిడ్‌ హిట్‌ లభించలేదు. మధ్యలో వచ్చిన ఐ, రోబో 2.o కూడా పర్లేదు అనిపించాయే కానీ బ్లాక్‌ బస్టర్‌ కాలేదు.

- Advertisement -

ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. కమల్ హాసన్ రాజకీయాల కారణంగా ఇండియన్ సీక్వెల్‌కు ఇప్పట్లో మోక్షం వచ్చేలా కనిపించడం లేదు. ఇక సినిమా తర్వాత పవన్‌, చెర్రీల మల్టీస్టారర్‌ పట్టాలెక్కించబోతున్నాడట శంకర్‌. ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ఇపుడు ఓ బడా తెలుగు నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించారట. ఇప్పటికే చరణ్ కు, నిర్మాతకు నేరేషన్ ఇచ్చారని టాక్. ఇంకా పవన్ కళ్యాణ్ తో చర్చించాల్సివుంది. ఆయన ఓకే చెబితే సినిమా సెట్ అయిపోయినట్లేనని చెబుతున్నారు. దాదాపు 200 కోట్లతో ఈ మల్టీస్టారర్‌ మూవీ నిర్మిస్తున్నారని టాక్‌. మ‌రి.. ఇదే క‌నుక నిజ‌మైతే.. మెగా ఫ్యాన్స్ కి పండ‌గే.

సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో పోసేస్తారు

రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ లుక్‌ రివీల్.

ఆస్కార్‌ అవార్డ్‌ రేసులో ‘నట్‌కట్‌’

పిలిచి మరి చాన్సిచ్చిన మెగాస్టార్‌!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News