Tuesday, April 30, 2024
- Advertisement -

అమెరికాలో 200 మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్‌..

- Advertisement -

అమెరికాలోని ఓఫేక్ యూనివ‌ర్శిటీ వ‌ల‌లో చిక్కుకున్న కార‌ణంగా 200 మంది విద్యార్థులు ఇబ్బందుల్లో ప‌డ్డారు. మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ పరిసరాల్లోని పర్మింగ్టన్‌ హిల్స్‌లోని ఓ యూనివర్సిటీ నుంచి అక్రమంగా సర్టిఫికెట్లు పొంది నివసిస్తున్నారన్న ఆరోపణలపై అక్కడి అధికారులు 200 మంది తెలుగు వారిని అరెస్టు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

విదేశీయులు పర్మింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి నకిలీ పత్రాలు పొంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ దేశంలో స్థిరపడుతున్నారన్న సమాచారం ఉండ‌టంతో హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులే ఏకంగా యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. సెక్యూరిటీ అధికారులు ఎనిమిది మంది యూనివర్సిటీ ఉద్యోగులుగా అవతారం ఎత్తి వర్షిటీలో చేరారు. అక్కడి సిబ్బందిలో కలిసిపోయి ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘాపెట్టారు.అమెరికా విద్యార్థులుగా ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేందుకు విదేశీయులకు ఈ వర్సిటీ సహాయపడుతోందని గుర్తించారు.

వ‌ర్షిటీ సిబ్బంది 600 మంది విద్యార్థుల‌కు అక్ర‌మంగా స‌ర్టిఫికెట్లు ఇచ్చార ని అధికారులు గుర్తించ‌డంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 200 మంది తెలుగు విద్యార్థులు ఉండ‌టం ఇప్పుడు క‌ల‌క‌ల‌కం రేపుతోంది. బాద్యులైన ఎనిమిది మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని ఉత్తర కరోలినా, డలాస్, న్యూయార్క్ తదితర సెంటర్లలోని జైళ్లకు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -