Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

- Advertisement -

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు జనవరి 8వ తేదీ నుంచి 16 వరకు సెలవులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విద్య, ఆరోగ్య శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సుధీర్ఘ సమీక్షలో ఈమేరకు ఆదేశించారు. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఒమిక్రాన్ వ్యాప్తిలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. రాష్ర్టంలో ఇప్పటి వరకు 70కి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమని మూడో వేవ్ ప్రారంభమైందని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఒక వేళ సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరిగితే సెలవులు పొడిగించే అవకాశం ఉంది. కావాలంటే కరోనా కేసులు తగ్గాక వేసవి సెలవులను కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో కూడా లాక్ డౌన్ అమలు సమయంలోనూ విద్యా సంస్థలను సుదీర్ఘ కాలం మూసి వేశారు.

YSR తెలంగాణ పార్టీలో చేరిన శ్రీ గట్టు రాంచందర్ రావు

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

హై అలర్ట్‌ .. థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -