Thursday, May 2, 2024
- Advertisement -

మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకో…!

- Advertisement -

 

AP CM Chandrababu Naidu class to Minister Nara Lokesh on ambedkar jayanti

కేటీఆర్ తండ్రికి మించిన త‌న‌యుడు అనిపించుకుంటుంటే …. లోకేష్ మాత్రం అందుకు  పూర్తి భిన్నంగా ఉంది వ్య‌వ‌హార‌శైలి. రాజ‌కీయాలు ఒంట‌ప‌ట్టించుకుంటాడ‌ని మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటే  చిన్న‌పిల్లాడికంటే అద్వాన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినా కూడా ఆయ‌న భాష మాత్రం మార‌డంలేదు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమం లో ఆయన అంబేద్కర్ జయంతి సందర్భంగా అనబోయి …..వర్ధంతి సందర్భంగా అని సంబోధించారు. అంటే… అంబేద్కర్ జయంతిని లోకేశ్… వర్ధంతిగా మార్చేశారన్న మాట. మంత్రిగా ఉన్న‌లోకేష్‌కు జ‌యంతి ,వ‌ర్థంత కి తేడాతెలియ‌దానీ ప్ర‌జ‌లు,పార్టీనాయ‌కులు మండిప‌డుతున్నారు.  ఏవైనా  కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ప్పుడు  త‌న స్పీచ్‌తో పార్టీ,ప్ర‌భుత్వం ప‌రువు తీస్తున్నార‌నీ సీరియ‌స్‌గా వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు క్లాస్ పీకార‌ట బాబుగారు.

లోకేష్ బాబ‌కు ఇట్లాంటివి కొత్త కాదు. చాలా సంర్భాల్లో  పార్టీ ప‌రువును మంట‌గొలిపారు.మొదటి నుంచీ లోకేష్ కి మాటల విషయం లో ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. ” ఈ రాష్ట్రం లో మత పిచ్చి కుల పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ..అ అవునా కాదా ” అంటూ గతం లో ఒకసారి తడబడ్డారు. అదే టైం లో ghmc ప్రచారం లో ” అన్నా సైకిల్ గుర్తికి గనక ఓటు వేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది ” అంటూ మళ్ళీ కామెడీ అయ్యారు. అంత‌కు ముందు ఎమ్మెల్సీగా ప్ర‌మాణ శ్వీకారం చేసేస‌మ‌యంలోనూ త‌డ‌బడ్డాడు.మొద‌టి నుంచి లోకేష్  మాట‌ల విష‌యంలో త‌డ‌బ‌డుతూనే ఉన్నారు.

ఈ  నేపథ్యంలో లోకేష్ ఇలాగే తప్పులు మాట్లాడుతూ దొరికిపోతుంటే తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నారట. తెరవెనక రాజకీయాలు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా రాజకీయాలల్లో అంతే ముఖ్యమని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకారట.  మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకొమ్మని, కనీసం రోజుకొక గంట అద్దం ముందు నిలబడి ఉపన్యాసాలు ప్రాక్టీస్ చేయమని చెప్పార‌ట‌, తెలుగు మీద పట్టు దొరికేవరకు మీడియాతో మాట్లాడవద్దని, పార్టీ మీటింగ్స్ లో కూడా మీడియా ఉన్నప్పుడు మాట్లాడవద్దని లోకేష్ కు బాబు వార్నింగ్ ఇచ్చారట. లోకేష్ కూడా తన తెలుగును సరిదిద్దుకోవడం మీద శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారట.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక్కొకసారి ఇలాగే తడబడుతున్నారు. అవినీతిలో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అని సాక్షాత్తూ అసెంబ్లీ లోనే బాబు ప్రకటించేశారు . అప్పట్లో చంద్రబాబు  పొరపాటు మాట్లాడినా, మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడం, అసలు సోషల్ మీడియానే లేకపోవడం వల్ల పెద్దగా నవ్వులపాలు కాలేదు. కానీ లోకేష్ ని ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు  ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆడుకుంటున్నాయి. ఇప్ప‌టికైనా లోకేష్ త‌న భాష‌ను మార్చుకుంటాడేమో చూడాలి.

Also Read

  1. బాలకృష్ణ తప్పిపోయాడంట.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
  2. లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?
  3. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా
  4. చంద్ర‌బాబుకు ముద్ర‌గ‌డ డెడ్ లైన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -