Monday, April 29, 2024
- Advertisement -

బీఎస్ఈలో మంచి డిమాండ్ ప‌లికిన‌ అమరావతి బాండ్లు…

- Advertisement -

నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్లు ఇన్వెస్ట‌ర్ల‌కు అందుబాటులో వ‌చ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది. మ‌న దేశంలో ఓ రాజధాని నిర్మాణం కోసం బాండ్లు రిలీజ్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ బాండ్లు రూ.10 లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది.

బీఎస్‌ఈలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఒక్కో బాండ్ విలువ రూ. 10 లక్షలు కాగా, ఆ ఇన్వెస్టర్ రూ. 60 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. ఇక ఈ బాండ్లపై ప్రభుత్వం సాలీనా 10.38 శాతం వడ్డీని చెల్లించనుంది. అందుకు ప్రభుత్వమే స్వయంగా కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. ఈ బాండ్ల విక్రయంలో టార్గెట్ ను చేరుకుంటే, మరో రూ. 700 కోట్ల విలువైన రిటైల్ బాండ్లను విక్రయించాలని కూడా ఏపీ సర్కారు భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -