Monday, April 29, 2024
- Advertisement -

పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు…అణుయుద్ధం తప్పదా….?

- Advertisement -

కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో సారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో అనుయుద్ధానికి కూడా వెనుకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇంకా బెదిరింపు ధోరణి కనబరుస్తోంది.

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించకపోవడంతో కయ్యానికి సిద్దమవుతోంది. మరో వైపు అగ్రరాజ్యాలకు హెచ్చరికలు జారీచేశారు. “గుర్తుంచుకోండి, ఈ వివాదం యుద్ధానికి దారి తీస్తే మాత్రం ఆ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. రెండు దేశాలు అణ్వాయుధ సహిత దేశాలే. అణుయుద్ధంలో విజేత అంటూ ఎవరూ ఉండరు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అగ్రరాజ్యాలపై పెను బాధ్యత ఉందంటూ బెదిరింపుదోరణితో మాట్లాడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -