Monday, April 29, 2024
- Advertisement -

NZ VS IND : వర్షం పుణ్యం.. సిరీస్ భారత్ సొంతం!

- Advertisement -

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా కిసీస్ జట్ల మద్య మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ భారత్ సొంతం అయింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండవ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా యువ సంచలనం సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టుపై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఫలితంగా సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఇక తాజాగా జరిగిన మూడవ టి20 మ్యాచ్ పై కూడా వర్షం ప్రభావం పడింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది.

కివీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవోన్ కాన్వే 49 బంతుల్లో 59 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 33 బంతుల్లో 54 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఇక ఆ తరువాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో హర్ధిక్ పాండ్య 18 బంతుల్లో 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 13 పరుగులు, రిషబ్ పంత్ (11), ఇషన్ కిషన్ (10) పరుగులు చేసి రాణించారు. ఆ తరువాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా.. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని డిసైడ్ చేయగా మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో రెండవ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచిన మహ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఇక నవంబర్ 25 నుంచి ఈ రెండు జట్ల మద్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -