Thursday, May 9, 2024
- Advertisement -

జీఎస్టీ కమిషనరేట్‌కు మహేష్ బాబు లీగల్ నోటీసులు

- Advertisement -

జీఎస్టీ బ‌కాయిలు చెల్లించ‌లేదంటూ హైద‌రాబాద్ జీఎస్టీ క‌మిష‌న‌ర్ గురువారం మ‌హేష్‌బాబుకు నోటీసులు పంపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై మ‌హేష్ బాబు లీగ‌ల్ టీమ్ స్పందించింది. కోర్టు ప‌రిధిలో ఉన్న బ్యాంకు అకౌంట్ల‌ను ఎలా స్తంభింప‌జేస్తార‌ని జీఎస్టీ కమిషనరేట్‌కు నోటీసులు పంపించారు.

వాస్తవానికి నిన్న జీఎస్టీ కమిషనరేట్‌ … పన్నులు చెల్లించాలంటూ మహేశ్‌బాబుకు చెందిన యాక్సిక్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లను స్థంభింప చేశారు. మహేశ్‌బాబు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 43 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బకాయీ పడిన 73 లక్షల రూపాయల్లో మిగతా మొత్తం రాబట్టుకునేందుకు మహేశ్ బాబుకు నోటీసులు పంపారు. చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడిని తానని, తన ట్యాక్స్ లన్నీ సక్రమంగా చెల్లించానని తెలియజేస్తూ లీగల్ నోటీస్ పంపారు. కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌లో విదేశాల్లో ఎంజాయ్‌చేస్తున్నారు. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు విదేశాలకు వెళ్లిన మహేష్‌ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ అందుబాటులో లేకపోవ‌డంతో లీగ‌ట్ టీమ్ ద్వారా కమిషనరేట్‌కు నోటీసులు పంపించిన‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -