Friday, May 3, 2024
- Advertisement -

పోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా..?

- Advertisement -

మొబైల్ యూజర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎక్కువగా గూగుల్ పే, పోన్ పే, పేటియమ్, భారత్ పే వంటి యాప్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని ఉపయోగించి సులభంగా ఇతరులకు మనీ పంపించడం లేదా మనీ అందుకోవడం చేస్తుంటారు. కేవలం మనీ ట్రాన్స్ఫర్ కోసమే కాకుండా మొబైల్ రిచార్జ్, డీటీఎచ్ రిచార్జ్, గ్యాస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్స్ ను వినియోగిస్తూ ఉంటాము. ఇక వీటి ద్వారా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు లేకపోవడం వల్ల అందరూ కూడా ఈ యాప్స్ ద్వార యూపీఐ మనీ సెండ్ చేసేందుకే ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఈ యాప్స్ వాడే వారికి త్వరలోనే బిగ్ షాక్ తగలనుంది.

ప్రస్తుతం జీరో చార్జెస్ తో ఆన్ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కు అవకాశం ఉన్న యూపీఐ యాప్స్ లలో త్వరలో రాబోయే నిబందనల ప్రకారం లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటుందట. అంతే కాకుండా ట్రాన్సక్సన్ చార్జెస్ కూడా విధించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ యాప్స్ లలో దాదాపు 80 శాతం మార్కెట్ ను పోన్ పే, గూగుల్ పే మాత్రమే ఆక్రమించాయట. దీంతో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( NPCI ) వాటి వాల్యు ను 30 శాతానికి పరిమితం చేసేందుకు ఎన్పిసిఐ ( NPCI ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్నీ అంశాలను కులాంకుశంగా పరిశీలించి ఆర్బీఐ డిసెంబర్ 31 నాటికి తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే ప్రస్తుతం ఎలాంటి ట్రాన్సక్సన్ ఫీజ్ లేకుండా మనీ ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉన్న గూగుల్ పే, పోన్ పే యాప్ లు.. ట్రాన్సాక్షన్ ఫీజ్ ల మోత పుట్టించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వాట్సప్ లో అద్భుతమైన ఫీచర్.. ఖచ్చితంగా తెలుసుకోండి!

ఇంటర్నెట్ లేకపోయిన అమౌంట్ సెండ్ చేయండిలా!

యూపీఐ ద్వారా డబ్బులు వేరే నెంబర్ కు పంపితే.. ఇలా తిరిగి పోడండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -