Wednesday, May 8, 2024
- Advertisement -

వాట్సప్ లో అద్భుతమైన ఫీచర్.. ఖచ్చితంగా తెలుసుకోండి!

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సప్ యాప్ వాడుతూ ఉంటారు. ఇతరులకు మెసేజెస్ పంపడానికి లేదా ఫోటోస్ పంపడానికి అత్యధిక మంది ఉపయోగించే మొబైల్ యాప్ వాట్సప్ ఒక్కటే. ఇక యూజర్స్ కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ ఉంటుంది వాట్సప్ సంస్థ. ఈ మద్య కాలంలో యూజర్స్ కు ఉపయోగపడే చాలా రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది..

ఇకపై వాట్సప్ లో పోల్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఈ పోలింగ్ ఆప్షన్ చూస్తూ ఉంటాము. ఈ పోల్ ఉపయోగించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటాము. ఇకపై ఇలాంటి పోలింగ్ వాట్సప్ లో కూడా చేయవచ్చు. ముఖ్యంగా వాట్సప్ గ్రూప్స్ అధికంగా యూస్ చేసే వారికి ఈ పోల్ ఆప్షన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. గ్రూప్ లోని మెంబర్స్ యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్ క్రియేట్ చేసి.. అందుకు తగ్గట్టుగా వ్యవహరించవచ్చు.

గత కొన్ని రోజులుగా బీటా వర్షన్ లో ఉన్న ఈ ఫీచర్ ను ఇప్పుడు గ్లోబల్ గా అధికారికంగా రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలమందికి ఈ అప్డేట్ వచ్చింది కూడా. ఈ పోల్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే.. వాట్సప్ ఓపెన్ చేసిన తరువాత.. కింద ఫిల్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే.. అక్కడ డాక్యుమెంట్స్, కెమెరా, గ్యాలరీ, లొకేషన్, కాంటాక్ట్స్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి కింగ ఇప్పుడు పోల్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మనం దేని గురించి పోల్ నివహిస్తున్నమో అందుకు సంబంధించిన క్వశ్చన్ రాసి కింద ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఆప్షన్స్ ను ఇచ్చి పోల్ క్రియేట్ చేయవచ్చు. ఇక ఇప్పటివరకు ఈ ఆప్షన్ రాని వాళ్ళు ప్లే స్టోర్ కి వెళ్ళి వాట్సప్ ను అప్డేట్ చేయడం ద్వారా ఈ పోల్ ఆప్షన్ ఎనబుల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంటర్నెట్ లేకపోయిన అమౌంట్ సెండ్ చేయండిలా!

యూపీఐ ద్వారా డబ్బులు వేరే నెంబర్ కు పంపితే.. ఇలా తిరిగి పోడండి !

మీ మొబైల్ సూపర్ ఫాస్ట్ గా మారే.. అద్బుతమైన ట్రిక్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -