Friday, May 3, 2024
- Advertisement -

రాజీనామా లేఖ‌ల‌ను చంద్ర‌బాబుకు ఇచ్చిన భాజాపా మంత్రులు

- Advertisement -

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలని నిర్ణయించడంతో… పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ కేంద్రమంత్రులు అశోక్గజపతి రాజు, సుజనా చౌదరిలు తమ రాజీనామాలను అందజేయనున్నారు. దాదాపు బీజేపీతో తెగదెంపులు ఖాయం కావడంతో పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు దూకుడు పెంచే అవకాశం ఉంది.

చంద్రబాబు నిర్ణయంపై బిజెపి ప్రజాప్రతినిధులు అత్యవసర సమావేశం జరిపారు. కేంద్రంలో టిడిపి మంత్రులు తప్పుకోగానే రాష్ట్రంలో బిజెపి మంత్రులు కూడా తప్పుకోవాలని నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశం ముగియగానే బిజెపి మంత్రులిద్దరూ చంద్రబాబును కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. అంతకుముందు జరిగిన మంత్రివర్గం సమావేశంలో కూడా పాల్గొనలేదు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న ఏపీ భాజాపా మంత్రులు ఇద్ద‌రూ రాజీన‌మాలు స‌మ‌ర్పించారు. భాజాపా నుంచి మంత్రులుగా ఉన్న మాణిక్యాల్‌రావు, కామినేని త‌మ రాజీనామాలేఖ‌ల‌ను చంద్ర‌బాబుకు ఇచ్చారు.ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మంత్రిప‌దువుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు మంత్రులు ప్ర‌క‌టించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేస‌కుంటాయో ఆస‌క్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -