Monday, April 29, 2024
- Advertisement -

బోయింగ్​ 737 జకార్తాలో టేకాఫ్.. సముద్రంలో శకలాలు..?

- Advertisement -

ఇండోనేషియాలో బోయింగ్​ 737 కనిపించకుండా పోయిన ఒకరోజు అనంతరం.. జావా సముద్రం నుంచి ఓ విమాన శకలాలు, వ్యర్థాలను వెలికితీశారు. ఇవి ఆ విమానానికే చెంది ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సోనార్ సిగ్నల్​ ఆధారంగా విమానం జాడ కనుగొనేందుకు అధికాకరులు ప్రయత్నిస్తున్నారు. విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి బుదికరియా సుమథి తెలిపారు.

మొత్తం 62మంది ప్రయాణికులతో బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు జకార్తా నుంచి బయలుదేరింది. 90 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా.. టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -