Tuesday, May 7, 2024
- Advertisement -

బీజేపీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉమా

- Advertisement -

వైకపా జనాలకి దూకుడు చాలా ఎక్కువ. రోజా , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడాలి నాని ఇలా ఆవేశానికి తగ్గట్టుగానే స్పందిస్తారు అందరూ. అసంబ్లీ సమావేశాల టైం లో వీరి అసలు కోపం చూడాలి. మైకు పట్టుకుని రెచ్చిపోతారు అసలు. అయితే వీరి ఆవేశానికి తగ్గట్టుగా ఏపీ అధికార పక్షం లో సమాధానం చెప్పేవారు పెద్దగా కనపడరు. వారితో పోల్చుకుంటే వీళ్ళు కాస్త బెరుకు మనస్తులు అయితే వారిలో కూడా ఒక కోపం తో మండిపోయే వ్యక్తీ ఇవాళ బయట పడ్డారు. ఇంతకాలం ప్రత్యర్థులపై చెలరేగిపోయే బొండా తాజాగా మిత్రపక్షంపై కూడా మాటలు పేల్చటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

తాజాగా కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేసింది. రెండు వేల కోట్ల కంటే తక్కువగా ఉన్న ఈ నిధులపై పలువురు అధికారపక్ష నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో పెదవి విరిచినా అదే విషయాన్ని బయటకు చెప్పేందుకు మాత్రం పెద్దగా ఇష్టపడలేదు. అందుకు భిన్నంగా బొండా మాత్రం మాట్లాడేశారు. కేంద్రం ఏపీకి చిల్లర విదిలించి.. ఎంతో ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటుందని సూటి వ్యాఖ్యను చేశారు.

ఏపీ పట్ల కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం కావటం లేదన్న ఆయన.. ఏపీ రాజధానికి రూ.45వేల కోట్లు అవసరమని.. అయితే.. కేంద్రం రూ.450 కోట్లు ఇచ్చిందని.. ఆ మొత్తం డ్రైనేజీకి కూడా సరిపోదని గుస్సా అయ్యారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీగా జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున చిల్లర విదిలిస్తే ఏం చేయాలన్న అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన.. బుందేల్ ఖండ్ కు రూ.7వేల కోట్లు.. ఒడిషాకు రూ.8వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -