Monday, April 29, 2024
- Advertisement -

వైసిపీకి ఇప్పుడు ఒక పెద్ద దిక్కు దొరికింది!

- Advertisement -

ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికారు బొత్స సత్యనారయణ. వైసిపిని తీవ్రంగ వ్యతిరేకించిన బొత్స వైసిపిలో చేరి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు.

1982 లో బొత్స సత్యనారాయణ రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ మంత్రి పదవి, పి.సి.సి పదవి వరకు ఎదిగారు. ఉత్తారాంద్ర రాజకీయాలలో బొత్స సత్యనారాయణ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. తర్వాత రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు బొత్సను అసంతృప్తికి గురి చేశాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఈ పరిణామం వైసిపి కి కలిసొచ్చే అవకాశమే అనుకోవాలి.

లోటస్‌పాండ్‌లో అధ్యక్షుడు జగన్ సమక్షంలో బొత్స వైసిపి కండువా కప్పుకున్నారు. బొత్సతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, డిసీబీ చైర్మెన్ తులసి, మాజీ ఎంపి బొత్స ఝాన్సీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. బొత్సకు ఉన్న అనభవం వైసిపికి ఎలా ఉపయోగ పడుతుందో వేచి చూడాలి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -