Friday, May 3, 2024
- Advertisement -

సీబీఐ మాజీ బాస్ అలోక్‌వ‌ర్మ‌పై హ‌త్యాయ‌త్నం…

- Advertisement -

సీబీఐ వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. ఆ సంస్థ‌మాజీ డైరెక్ట‌ర్ అలోక్‌వ‌ర్మ‌పై న‌లుగురు వ్య‌క్తులు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. నలుగురు వ్యక్తులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులతో వచ్చి, అలోక్ వర్మ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బందిని గ‌మ‌నించిన ఈ నలుగురూ, పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, జవాన్లు, వారిని అడ్డగించి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

అలోక్ వర్మ ఇంటి ముందు హైడ్రామా చోటు చేసుకోగా, నిందితులను రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.తనను అక్రమంగా తొలగించారంటూ సుప్రీంకోర్టులో అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనున్న సంగతి తెలిసిందే.

మరోవైపు సీబీఐ డైరెక్టర్‌‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై మరోకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఆస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రతిష్టపై మచ్చ పడింది.

పరువు బజారున పడటంతో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి వర్మ, ఆస్థానాలను సెలవుపై పంపింది. దీంతో మన్నెం నాగేశ్వరరావును సీబీఐ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -