Thursday, May 2, 2024
- Advertisement -

కలిసిపోయిన జగన్ – చంద్రబాబు ? కారణం !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయం లో కేంద్రం అన్యాయం చేస్తోంది అంటూ ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ ప్యాకేజీ లో డొల్లతనం సీరియస్ గా ఉంది అని అసలు పొరపాటున కూడా ఎపీకి మంచి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చెయ్యడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ప్యాకేజీలోని డొల్లతనాన్ని నిరసిస్తూ.. ఈ నెల 10 శనివారం రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు ప్రత్యేక ప్యాకజీ కూడా ఇవ్వాలని ఇది ఆంధ్రుల హక్కని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కు బిక్ష కాదని ప్యాకేజీ ఇవ్వాలని నిన్న కేంద్రం చేసిన ప్రకటనకు చట్టబద్ధత కల్పించాలని చలసాని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాము బంద్ కు పిలుపునిచ్చినట్టు చలసాని చెప్పారు. తమ బంద్ కు  విద్యార్థి సంఘాలు సహా అన్ని పక్షాలూ మద్దతిచ్చాయని తెలిపారు.

 ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా కేంద్రం సహా చంద్రబాబు ప్యాకేజీని ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనకు నిరసనగా ఏపీ బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా  ఈవిషయంలో కామ్రెడ్లతో కలిసి చంద్రబాబు సహా కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ప్యాకేజీకి తలొగ్గడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెరిగేలా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు దగ్గరుండి కేంద్ర ప్రభుత్వం చేత ఏపీ ప్రజల చెవిలో క్యాబేజ్ పెట్టించారని జగన్ విమర్శించారు. కేంద్రం నుంచి వైదొలుగుతామని చంద్రబాబు చెప్పినప్పుడే ప్రత్యేక హోదాపై కేంద్రం దిగివస్తుందన్నారు.

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -